ఈ రెండు రోజుల హడావిడి వల్ల ఆంధ్ర జనాలకి ఒరిగిందేమీ లేదు కాలక్షేపం, కాసింత మసాల. ఆపుకోలేని ఆత్రుతని చల్లార్చుకోవడం తప్ప! ఏం చేద్దామని ఏం చేసిందో కాని ఈ అధిష్టానం తలనోప్పంటే మోకాలికి బానే వేసింది, zandu balm .
సందెట్లో సడేమియా లా తంతే బూరల బుట్టల పడ్డట్టైయింది కిరణు కుమారుడికి. యోగం భోగం రాసి పెట్టుంటే ఆపడం ఎవ్వరి తరము కాదు.
పాపం సమ్మె చేసే ఉద్యోగులు రోడ్డు బాట పట్టిన బీడి కార్మికులు వాళ్ళని పలకరించే నాధుడే లేకపోయాడు పేపర్లు మీడియా అంతా ఈ డ్రామా వెనకాతలే పడ్డారు . బీహారు ఎలెక్షన్ పలితాలు చూసినా కాని వాతకి మందు బర్నాల్ కాని zandu balm కాదని ఎప్పుడు గ్రహిస్తారో ఈ కాంగీయులు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే నాయకుడే కరువయ్యాడు కాంగిరేసు లో.ఈ కిరణుడి మీద ఆల్రెడీ ఎన్నో ఆరోపణలున్నాయి. బాబుకి మళ్ళి పనికి సిద్దం అవ్వాలి. పొద్దున్న లేస్తూనే ప్రబుత్వం మీద విరుచుక పడాలి కదా. చేత కాకపొతే దిగు దిగు అని రోశయ్య దిగే దాక అరిచి అలిసిపోయాడు ఇప్పుడు కిరణ్ మీద అరవాలి. ఎంతైనా బాబు వాసి రాసి అన్ని బాగున్నై. అయన ప్రతిపక్ష నాయకుడిగా ఎంత మంది CM లను చూస్తున్నాడో! CM లు మారతున్నారే కాని ప్రతిపక్ష నాయకుడిగా ఈయన స్థానం సుస్థిరం. తుమ్మితే ఉడే CM పదవి కన్నా కదలని opposition leader పోసిషన్ఏ బెటర్.
జగన్మోహనుడు కొత్త sketch తో రావాలి. ఆయన రాతలకి కోతలకి కొన్నాళ్ళు విరామం. తలకు కట్టిన బొప్పి కొంచెం మాడు పట్టాలంటే కొన్నాళ్ళాగాలి. మళ్ళి అయన బిజీ బిజీనే . కిరణు కుమారు కూడా బిజీ బిజీ అధిష్టానం ఆదేశాలణుగుణంగా నడుచుకొని అధిష్టానానికి కోట్లఅoదియాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక బంగారు బాతు గుడ్డు కాబట్టి. తెలంగాణా కాంగీయులు మాత్రం ఎప్పడి లాగ వాళ్ళ అజెండా వాళ్లకి ఉంటుంది. సోనియా అమ్మ, అధిష్టానం , అనవసర సమయాల్లో అక్కరకు రాని ఆవేశం బోరు కొట్టనే కొట్టవు. వాళ్లకవి పుష్కలంగా ఉన్నాయి. పూటకో బట్రాజు గీతం రోజుకో వీధి బాగోతం చూసి చూసి TV చూసే వాడికి బోరు కొట్టి ఎవ్వడి పాపాన వాడు పోతాడులే అని ఛానల్ మార్చి మనం మారాల్సిందే వీళ్ళు మారరు.
ఇంకో విధంగా ఆలోచిస్తే ఉన్న తుప్పు(క్కు) మంత్రి వర్గ ప్రక్షాళన చేయడానికి ఇదే ఒక మార్గంగా కూడా ఆలోచించి ఉండొచ్చు. కాని ఏ విధంగా చూసినా CM ఎంపిక సామాన్యుడి ఆశలకు అడియాసే. పాలడుగు వెంకట్రావు మద్యాహ్నం సామాన్యుడి లాగానే ఒక అడియాసని వ్యక్త పరిచాడు, మళ్ళి నేను కాoగ్రెస్సు వాడినని రొమ్ము విరబూచుకొని తిరిగే లెవెల్లో CM ఎంపిక ఉండాలని. నువ్వు నాకు నచ్చావ్ లో వెంకీ లాగ నీవు ఇస్తావు ఎందుకంటే basically నీవు మంచి GOD వి అని ఆశ పడినా మనం రోడ్డు మీద పదాలే కాని మన ఆశలు పైవాళ్ళ చెవుల్లో పడవు. ఓట్లు వేసేది మనం సీట్లు డిసైడ్ చేసేది పైవాళ్ళు. ఏముంది ఒక 2 రోజులుంటే అంతా షరా మామూలే. ABN ఛానల్ లో న్యూస్ ఆశించి ట్యూన్ చేస్తే 24 గంటల్లో 20 గంటలు మహా యంత్రం , గ్రీన్ టీ అని ప్రకటనలు వచ్చి కడుపులో తిప్పినట్టు ఒకటి కాకుంటే ఇంకో Ad ఉన్న ఛానల్ తిప్పిడం, అన్ని మనకు అలవాటే .
Wednesday, November 24, 2010
అధిష్టానం తలనోప్పంటే మోకాలికి బానే వేసింది zandu balm
Saturday, October 23, 2010
ప్రతికారమే పరమసోపానం -నిజమే మరి ప్రతీకారం తీసుకున్నాక అలానే అనాలి
ప్రతికారమే పరమసోపానం - మహాభారతం ఇటువంటి ట్యాగ్ లైనుతో తోటి బ్లాగరుల రివ్యులతో దగాపడి థియేటరు బారిన పడ్డాను రక్తచరిత సినిమా కోసం.
కథ కథనాలు చర్చించడం ఈ పోస్టు ఉద్దేశం కాదు
అదేంటో హైదరాబాదులో అస్సలు టికెట్లే దొరకట్లేదు ఎక్కడ కెళ్ళినా అన్న so called hype విని. సత్య, శివ,గాయం, కంపెనీ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్డులని చేసే పడే సత్తా ఉన్న డైరెక్టర్ కదా అని ఆశతో అడుగుపెట్టిన నాకు అడియాసే ఎదురయింది. సినిమా మొదలైన అరగంటకు కూడా నేను తెలుగు సినిమాకు వచ్చానో డబ్బింగ్ సినిమాకు వచ్చానో నిజంగానే అర్ధం కాని అయోమయ పరిస్తితి కోట తప్పించి నాకు తెలిసిన నటి నట వర్గం ఎవ్వరు కనిపించకపోవడమే కారణమేమో,వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎం మాట్లాడుతున్నారా అని concentration తో వినాల్సిన పరిస్థితి కనీసం హిందీ వెర్షన్ కి వెళ్లి ఉంటే కాస్త nativity దక్కేది $2 డాలర్స్ కూడా! తినగా తినగా వేము తీయగుండు చూడగా చూడగా తెలుగు సినిమా డబ్బింగ్ అర్ధం అవుతునుండు అనుకుంటూ నాకు పెద్ద తేడ ఏమి కనిపించలే ఫ్లో కి అలవాటు పడిపోయా ఎంతైనా సగటు తెలుగు ప్రేక్షకున్ని కదా!
మార్కెటింగ్ తెలివితేటలూ పక్కన పెడితే వర్మ చాల తెలివిగా ప్రవర్తించాడు. సామాన్య జనాలకి పరిటాల రవి గురించి తెలిసింది అంటే రవి, సూరి సంఘర్షణే , ఆ అంశాన్ని ఏమాత్రం స్పృశించకుండా మొదటి భాగాన్ని $12 ముక్కు పిండి వసూలు చేసి ఇంటికి పంపించాడు చివరిగా పార్ట్ 2 promo తో,కొంచెం curiosity లెవెల్స్ పెంచే విధంగా.ఇంతోటి దానికి రెండో పార్టు చూడటం ఒకటి. నీ ఆటే వద్దంటే పట్టు చీర కట్టుకొస్తా అన్నట్టుగా. curiosity kills the cat అని నాకు తెలిసిపోయింది కదా కాస్త జాగ్రర్తగా ఉంటాను.
ఇందులో హై వోల్టేజి సీన్సు కూడా నాకేమి కనిపించలేదు ప్రేక్షకున్ని కట్టిపడేసే విధంగా, హీరో కొడవలి పట్టుకొని కనపడటం తప్ప. బుక్కా రెడ్డి పాత్రధారి మాత్రం బాగా విలనీ చూపించాడు.
అవునన్నట్టు వర్మ మాంచి strategist ఆండోయ్ , తానూ ఈ సినిమా తీసిన టైమింగ్ చూస్తె అర్ధం అవుతుంది. ఇటివల వరస ప్లాపులతో సతమతమవుతూ తానూ నడిచిన నల్లేరు నడకనే మల్లి చూపిద్దమనుకున్నాడు, జనాలకు వాళ్లకి ఏం కావాలో వాళ్ళకే అర్ధం కాని పరిస్తితుల మూలాన, TV9 చానెళ్ళ పుణ్యాన, ఖలేజా,బృందావనము హిట్టో ఫట్టో తేల్చుకోలేని కన్ఫ్యూజన్ ముమెంట్లో సైలెంటుగా సినిమా రిలీజు చేసేసాడు. తనకున్న మాటకారి తనన కావాల్సిన ఫ్రీ పుబ్లిసిటీ ముందుగానే సంపాయించుకొని ఓపెనింగ్స్ ఐతే సంపాయించు కున్నాడో, కుంటాడో. ఈ మూవీ ఆడక పోయిన వర్మకు వచ్చే నష్టం ఏమి లేదు ఉన్న 10 ఫ్లాపుల్లో మరొకటి వచ్చి చేరుతుంది, స్టార్ కాస్ట్ కి గాని సాంగ్స్ picturesation కి ఖర్చు చేసింది ఏమిలేదు.అందరు తెలీని మొహలాయే, పాటలు లేకపోయే గొప్పవి. ఆడిందా మొదటి రోజు నించి జమా ఖతాలోనే! i feel varma completed his best .
మరో విషయం మహా నటుడు NTR పాత్ర చిత్రీకరణ ఏ మాత్రం సరిగా లేదు. మహా నటుడి అభిమానులుకి మాత్రం కొంచెం కంటగింపుగానే ఉంటుంది. He was shown in bad light
సామి రంగా అస్సలు పాయింట్ మరిచానండి ఎన్ని చెప్పుకున్న ఈ అస్సలు విషయం చెప్పుకోకుంటే వ్రతం చేసి ఉద్యాపన చేయనంత పాపం, అదేనండి వర్మ వాయిస్ ఓవర్ . అది నిజంగానే ఓవర్ అయింది నాకితే అలానే అనిపించింది మిగిలిన వాళ్ళకి ఏమనిపించిందో తెలిదు కాని. అందుకే అన్నారు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలనీ దీనినే కొంచెం raw terminology లో ఒక సామెత ఉంది గుర్రం పని గుర్రం చేయాలనేసి మొత్తం చెప్పట్లేదు ఆ సామెత ఎందుకంటే వర్మ పాత సినిమాల గౌరవం నాలో ఇంకా మిగులుంది.ఏ మాత్రం impressive గా లేదు. ఈ సినిమా జష్ట వదిలించుకోవడానికి మూవీ చూశాక ఖలేజా టీవీ లో చూస్తే కాని కాస్త రిలీఫ్ కలగలేదు, పోస్టు రాయడం తో పాటు. ఇంతకూ మించి నాకు రాయడానికి ఇందులో ఏమి ఉందనిపించలేదు
Monday, September 13, 2010
అనుకోకుండా అయ్యాను నేను సామంత రాజుని నేను-కాంగిరేసు మార్కు రాజకీయంతో
అనుకోకుండా అయ్యాను నేను సామంత రాజుని నేనూ!
నిర్ణయలేమి నా నైజం అనుభవమే నాకున్న బలము
గడిపేస్తాను ఆడేస్తాను పాలిస్తాను ఆంధ్రదేశాన్ని
కాంగిరేసు మార్కు రాజకీయంతో
ఎవరేమంటే ఏమి నాకేంటి సామి
నవ్వే టోళ్ళు నవ్వనీయని సామి
అరిచేటోల్లే అలిసిపోని సామి
దేవుడే చల్లంగుండా నా ఆరోగ్యం సక్కoగుండా
గడిపేస్తాను ఆడేస్తాను పాలిస్తాను ఆంధ్రదేశాన్ని
కాంగిరేసు మార్కు రాజకీయంతో
సామ్రాజ్ఞి అండ నా చెంత నుండ
ఆంధ్రా మన్మోహనుడంటూ పాడేటి భట్రాజులు నా తోడు ఉండ
తెలంగాణా వాదులు సీమంధ్రా నాయకులు కోట్లడుతూ ఉండ
జగన్మోహను ఓదార్పు చేస్తూ ఉండ
గడిపేస్తాను ఆడేస్తాను పాలిస్తాను
చెణుకులు చెడుగుడు ఆడేయ్యగలను
అసెంబ్లీలో విపక్షం నోటికి తాళం వేసేస్తాను
యువరాజు జన్మదినానికి ఆయన ఫోటోకే కేకు తినిపిస్తాను
అందివచ్చిన అవకాశము దేనినీ వదలను నేను
రేపన్నది ఎవడు చూడొచ్చాడు
రాజేవడో బంటు ఎవడో
ఈ దినము నాదేనన్న
చంద్రన్న బిక్క చచ్చి యాత్రలు చేస్తూ పోనీ
ముక్కు తిమ్మన ఆంధ్రా పార్టీ అంటూ చంద్రన్నని టార్గెట్ చేసేయని
రైతులు యూరియా అంటూ గగ్గోలు పెట్టని
గందరగోళం తింగరమేళం ఈనాడు నా రాజ్యం
చుక్కాని లేని నావకి ఎండిపోయిన పుల్లొకటి చుక్కాని అయిన వైనం
సామాజిక వాదం అంటూ ప్రజారాజ్యం స్థాపించి
అనుకోని సమయాన సమైఖ్యమంటూ
తత్తర బిత్తర పాటు మండాలాధీశుడు
నా బలము నీదేనంటూ పిలవని పేరంటానికి వస్తానంటూ
అయోమయపు నాయకులూ ఉన్నంత కాలం
ప్రతిదినము నాదేనన్న సామంత రాజుని నేనేనన్నా
ఇలా అనుకోకుండా అయ్యాను నేను సామంత రాజుని నేను
కాంగిరేసు మార్కు రాజకీయంతో
జీవితకాలపు స్వప్నాన్ని కలకు అందని ఉత్ధనాన్ని
పొందాను నేను కాంగిరేసు మార్కు రాజకీయంతో
Monday, September 6, 2010
ఉద్యమాలలో ఉన్న కిక్కు- ఉద్యోగాలలో లేదన్నా
ఉద్యమాలలో ఉన్న కిక్కు
ఉద్యోగాలలో లేదన్నా!
ఉద్యోగ వేటకై ఏళ్ళ తరబడి శ్రమ సైతం
లిప్త పాటున ప్రశ్నాపత్రాన్ని చింపేసి
వెనుతిరిగే యోధులం మేమన్నా!
OMR sheet ఒక్కేటున చింపేస్తాం
ప్రశ్నాపత్రం ఒక్క ఉపుతో విసిరేస్తాం
భవిష్యత్తు కాలదోసి నిర్లజ్జగా కాలరెగరేసి
ఘన చరిత పుత్రులం
విద్వంసాల బాట నడిచేటి ఘన చరితులం
తల్లి వద్దు తండ్రి వద్దు
వాళ్ళు కన్న కలలు అసలే మాకొద్దు
ప్రతి ఉదయం ఒక సంగ్రామం
ఇదే మా జీవనయానం
కుటిల రాజకీయుని అరుపులే మాకు శంఖారావం
ఎవెడెక్కువ అరిస్తే వాళ్ళ దారిలో మే నడుస్తాం
ఉసికోల్పే మాటలకు మా ఎడ్రినలిన్ నిపుతాం
పురికొల్పే చేష్టలకు బస్సులను తగలెడుతాం
అనునిత్యం జరిగే విద్వంసాల హొరులో
నేలకోరగని నాయకుడు లేడులే
ఈ సంగతి నాకేరుకనే
అదే జరిగితే ఉసికొల్పే వాడెవ్వడు
మా రక్త నాళాలకు ఉపిరి నింపేదెవ్వడు
దేశ భాషలందు తెలుగు లెస్స
అన్న రాయలకి ఏమి తెలియదని నాకేరుకే
ఆయనకెరుకైతే తెలుగులో
భిన్న బాషలున్నాయని భిన్న సంస్కృతిలున్నాయని
రాయకుండా ఉండునా
అందులో ఏ తెలుగు రాస్తున్నాడో
చెప్పక మిన్నకుండునా!
ప్రతి ఉదయం TV9 తో మా స్నేహం
అది చూపే విధ్వంసాల దృశ్యాలే మాకిష్టం
పదికి ఇరువై మార్లు
ఒకే లొల్లి మార్చి మార్చి సాగతీసి చూపిస్తే
ఇరువై లొల్లిలు నే చేయక ఉందునా
కల్లబొల్లి మాటలలో నా జీవితం గడిపేయనా
ఇది నే సాధించిన మహా ప్రగతి
గడిచిన రేయిలో
మిగిలిపోయిన చీకటిలో
ఆవిరైన కలలను
కదల లేని ఆశల పల్లకిలో
భారంగా మోస్తున్న
ఈ తరపు ప్రతినిధులం
అయోమయపు యువకులం
Tuesday, August 31, 2010
సిగ్గు లేని సమాజం నిర్లజ్జతో కూడిన వ్యవహారం
సిగ్గు లేని సమాజం నిర్లజ్జతో కూడిన వ్యవహారం
గురుత్వానికి ప్రాంతీయత ఆపాదించిన ఈ వైనం
ఎటువైపు మన పయనం
కల్లోల తీరాలను గమ్యంగా చేసుకొని
వడివడిగా అడుగులేస్తూ అక్కరకు రాని ఈ ఆవేశం
నా ప్రజలు నా భాష నా రాష్ట్రం అంటూ
ఎలుగెత్తి చాటరా అని బోధించిన మహనీయుల మాటల
ముత్యాల మూటలను మరిచిపోయి
కుత్సితం సంకుచిత్వం కల్లోలమే నా దారులంటు
ప్రతిరోజు ఒక విధ్వంసం
ఎటువైపు మన పయనం
గొడవ చేయడానికేది కాదు అతీతం అంటూ
అక్కరకు రాని ప్రతి విషయం రాద్దంతం చేస్తున్న
రాజకీయ నిరుద్యోగుల బడిలోన పాఠాలు నేర్చుకుంటూ
తప్పటడుగులు వేసుకుంటు కాలాన్ని వృధా చేస్తున్న యువతరం
కళ్ళు తెరిచి చూసెసరికి నడిమద్యన సూరీడు పడమట గడపకు
పయనమవడా
కాలినా చేతులకు ఆకుల కోసం వెతికేటి ప్రయాస
యువతకు మిగులునా?
స్మశానం నుంచి స్వర్గాన్ని సృష్టించిన
జపనీయుని నుంచి పాఠాలు నేర్వమేమి
శ్రమైక సౌందర్యంలొ ఆనందం దాగుందని
అద్భుతాలు సృష్టించి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న చైనా
అడుగుజాడలు చూడమేమి
విధ్వంసాలతో గడిపేటి ఏ తరము చరితలో
మసకబారక తప్పదని ఏ చరిత్ర చదివితే అర్ధమవునో కదా
Wednesday, July 21, 2010
బాబు బాబ్లీయం
ఉగ్రవాదులు దాడులు తెగపడుతుంటున్నప్పుడు ఆక్రోశం కలుగుతుంది. మొన్న బాబ్లీలో జరిగిన దుశ్చర్య చూసి వాళ్ళ నుంచి అంతకంటే ఎక్కువ ఆశించడం అడియాసే అనిపిస్తుంది. కొందరికి ఇది బహుశా అతిశయోక్తి అలంకారం అనిపించి ఉండొచ్చు. మరికొంతమందికి ఒక అడుగు ముందుకు వేసి బహుశ నేను తెలుగుదేశం సానుభూతిపరుణ్ణీ కూడా అయిఉంటాను. బాబు బాబ్లీ యాత్ర చెపట్టిన టైమింగ్ సబబా కాద దానిలొ సరిపాళ్ళు ఎంత అన్న అంశాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. రాజకీయం అంటేనే ఒక అవకాశవాదం, వాళ్ళ నుంచి నేను అంతకన్నా ఆశించలేను బహుశా ఈ అడుగు దాటి మరో ఆలోచన చేయడానికి ఇది excuse కాదనుకుంటా!రాజకీయ నాయకులు సామన్య ప్రజానీకానికి ఆ విధంగా expectations, bench marks ఆల్రేడీ set చేసేసారు.
ఏదేమైనప్పడికి మహారాష్త్ర ప్రభుత్వం పాల్పడిన ఈ నియంత్రుత్వ పోకడలు నా ఊహ ఎరిగి కనీవినీ ఎరగను. రాజ్యంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో వ్యవహరించిన తీరు అందులోనూ మహిళా ప్రతినిధులతో అవమానించిన తీరు గర్హనీయం.మనలో మనకే ఇంత విద్వేషాగ్ని ఉన్నప్పుడు శత్రుదేశం అయిన పాకిస్థాను ఆ విధంగా దాడులు తెగబడటం వాళ్ళనుంచి మంచి ఆశించడం అత్యాశే.
ఇక్కడ జరిగిన ఈ సంఘటన నేటి రాజకీయాలలో కొత్త పోకడలకు నాంది. ఇది ఒక trend setter అయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది.మొన్న YSR చనిపోతే ఎందరో గుండెపోటుతో పోయారు.నిన్న బాబు అరెస్టు వార్త విని అదే గుండెపోటుతో చనిపోయారు.ఏంజరుగుతుందిక్కడ అని హరిక్రిష్ణ అన్నట్టు అరవాలనిపిస్తుంది కాని నేను రాజకీయ నాయకుడిని కానే.దేశం నాయకుల్ని ఎన్ని రకాలుగా అవమానించరో ఇక్కడ ప్రస్తావించడం చాట భారతాన్ని reprint చేసినట్టవుతుంది.
ఒక సమస్యను పలు రకాలుగా పరిష్కరించవచ్చు.ఆ మూఢులు దండం దశగుణం భవేత్ అని ప్రయొగించారు.ఇంత జరుగుతున్నా ఇక్కడ ప్రభుత్వం చేష్టలూడి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం తీవ్రమైన ఆశ్చర్యం కల్గిస్తుంది.రోశయ్య వాక్పటిమ అసెంబ్లీ లోనే కానీ ఒక కీలక తరుణంలో నిర్ణయలేమి ఆయన తత్వమో లేక నిస్సహయతనో లేక కాంగ్రెస్సు వాది కాదనో!
మన కేసియార్ కేమో ఎడారి భూమి అయినా సరే దానిపై తెలంగాణ అని బోర్డు చూసుకునే చాలు ఆయన జీవిత కాల స్వప్నం నెరవేరినట్టే రాజినామా కాకుండా ప్రజోపయోగ కరమైన ఉద్యమాలు ఏమి చేసాడొ నేనెరగను.
మొన్నటికి మొన్న సోంపేట లోనూ అదే తంతు.మన వాళ్ళను మనమే శిక్షించుకుంటున్నాం.మనం మావోయిస్టులను అంటున్నాం మనలోనే దాగున్న మావోయిజం గుర్తించలేకపోతున్నాం.ఎవరెవరి శక్తానుసారం వాళ్ళ సామర్ద్యాల అణుగుణంగా ఆటవిక న్యాయం చేయడమే మారుతున్న రాజకీయల అర్ధం అనుకుంటా!
నేనూ ఒక మనిషినే
నేనూ ఒక మనిషినే
నా దారిన నే పోతున్నా
నేనూ ఒక మనిషినే
పక్కవాడి వ్యధ నాకెందుకులే అనుకున్నా
నేనూ ఒక మనిషినే
నా పక్కన రావణకాష్టం రగులుతున్నా
చీమ చిటుక్కక్కమన్న భావన నాలొ లేకుండ నిలుచున్నా
నేనూ ఒక మనిషినే
నాకేమవసరమని నడుస్తున్నా
మాధ్యామల మంత్రజాలంలో రోజులనే గడుపుతున్నా
సినీమాల మాయలో కాలాన్ని వౄధా చేస్తున్నా
ల్యాప్ టాప్ బ్యాగ్ ని భుజానికెత్తుకోని
బడి పిల్లొడి మాదిరిగా ఆఫీస్ వెళుతున్నా
బాధన్నది నాకు లేదు
నా ప్రపంచం లో నేనున్నా
survival for fit test నేటికి కానవస్తున్నా
చలనమన్నది నాకు లేదు అలజడన్నది నాలొ లేదు
మనసుకే సున్నితత్వం పోయిందా
ఆలొచన కూడా చేయకుండా మౌనంగా మిన్నకున్నా
నేనూ ఒక మనిషినే
కంప్యూటర్ యుగపు నర రూప మర మనిషిని