నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Wednesday, March 4, 2009

నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 22

----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------



ప్రక్కనున్న చందమామ
దూరముంచి ఏడిపించమాకమ్మా
వలపు ధారలు వంస ధారలుగా
మార్చి ఉన్నా మనసు మారదా
వలపు బాసలు మరిచినావు
చెలిమి ఊసులు దాచినావు

వెలుగు నీకు తోడు ఉందని
నీడలోకి నను నెట్టినావా
ఊసులేదు ఊపిరి దూరము చేసినావు
మల్లెపూవు పరిమళమే మరిచిపోయావు

ఎక్కడున్నా ఏమి చేస్తున్నా
తెఱచాటు ఆలొచనలలో
మనసు నంతా నిండిపోయావు
ఆశలేమి లేకున్నా
ఊపిరి ఉన్నంతా నీ ఊహల ఊసులాగవేమో

నిన్నటి చెలియా కలనైనా
కలవవా అని కనులు మూసి చెమ్మగిల్లిన
నీళ్ళలో నీ రూపన్నే దాచినాను
ఆవిరాయేను వీగిపోయేను
నీ ధ్యాసలో నేనిలా మిగిలి పోయాను

--మేఘ

Tuesday, March 3, 2009

నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 21

----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------


మదిలో ఎన్నేన్నో ఆలోచనలు
గతకాలపు ఞ్నాపకాలు
మది తాలుకు తలుపులు తీస్తే
దిక్సూచి దారి చూపలేని దిగంతాల తీరాలు
దాహం వేసినా తాగలేని సుముద్రయానాలు
విడిది చేసె ఎడారి పయనాలు
ఇవి నే పయనం చేసే దారులు

ఆకశం వైపు ఆశగా చూస్తుంటా
అగమ్యగోచరమైన మదికి ఓ గమ్యం దొరకునని
జలపాతాల హోఱునే వింటుంటా
నా మదిలో అలజడి సవ్వడి ఆగునని
సాయం సమయం కాగానె నీ మది ఆలొచనలతో
ఇలా పొద్దు కూసే వేళ కొసం
దిగాలుగా మిగిలిపోయి ఎదురు చూస్తుంటా