నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Tuesday, June 14, 2011

తోలుమందం జీవితం ఇలానే నడుస్తుంటుంది కడుపులో చల్ల కదలకుండా!

పురాణాలలో యోగులు, చక్రవర్తులు లోక కళ్యాణ కాంక్షతో రాజ్యాన్ని, సంసార తాపత్రయాలు త్యజించి సంవత్స్తరాలు, సంవత్స్తరాలు తపస్సు ఆచరించేవారట! ఒక్కోసారి అవి వింటున్నప్పుడు పురాణాలూ నమ్మశక్యం కాని రీతిలో వర్ణించబడ్డట్టు మనసుకు తోస్తుంది. కారణం మనిషన్నవాడు తన గురించి ఆలోచించకుండా కేవలం పరుల కోసమే ఆలోచించడం ఎలా సాధ్యం అన్న మీమాంశ ఆ నిజాన్ని మనం నమ్మలేని విధంగా అలోచిoప చేసేటట్టు చేస్తుంది.
ఒక రోజులో కనీసం కొంతసేపైనా కేవలం అవతలి వాళ్ళకోసం ఆలోచించడం అన్నది ఉహకైనా అందుతుందా?మనల్ని ఆ స్థానంలో ఉహించుకుంటే 99 ,9 % మంది చివరి వరసలో చిట్ట చివర నిలిచే వాళ్ళమే.
ఈ సోది రామాయణం చాట భరతం ఎందుకంటే ఈరోజు చదివిన వార్త మనసుకు కదిలించి వేసింది.దాని సారంశం హరిద్వార్ కు చెందిన ఒక సాధుపుంగవుడు గంగా నది పరిరక్షణకు నడుం బిగించి నాలుగు నెలలుగా నిరాహార దీక్ష చేస్తూ గతించాడు.ఆ మహనీయుడు మరణించాక కాని మనకు ఈ వార్త తెలియలేదంటే ఏమనుకోవాలి.ఇది జరిగింది హిందుత్వ పరిరక్షణకే మేమున్నది అని బీరాలు పలికే BJP పాలిత రాష్ట్రంలో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే సామాన్యుడికి ఒరిగేది ఏమి లేదు. దొంగలు దొంగలు ఉళ్లు పంచుకున్నట్టు మన మీద పడి కోట్లకు పడగలేత్తుతారు.మనం కూడా ఇంతకంటే చేయగలిగేది లేదు.ఎవడికో ఒకడికి ఓటు వేయడం తప్పించి.అందరూ ఆ విషవృక్షపు కొమ్మలే.
అప్పుడప్పుడు ఒక హజారే రాందేవ్ వచ్చి వారి శక్తి మేర పోరాడి నిష్క్రమిస్తారు.ఈ పరిణామంలో ఆ తరపు ప్రతినిధులు కోల్పోవడం తప్పించి.ఈ తోలుమందం జీవితం ఇలానే నడుస్తుంటుంది కడుపులో చల్ల కదలకుండా.

http://timesofindia.indiatimes.com/india/Sadhu-dies-after-4-month-fast-to-save-the-Ganga/articleshow/8847216.cms