నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Monday, September 6, 2010

ఉద్యమాలలో ఉన్న కిక్కు- ఉద్యోగాలలో లేదన్నా



ఉద్యమాలలో ఉన్న కిక్కు
ఉద్యోగాలలో లేదన్నా!
ఉద్యోగ వేటకై ఏళ్ళ తరబడి శ్రమ సైతం
లిప్త పాటున ప్రశ్నాపత్రాన్ని చింపేసి
వెనుతిరిగే యోధులం మేమన్నా!

OMR sheet ఒక్కేటున చింపేస్తాం
ప్రశ్నాపత్రం ఒక్క ఉపుతో విసిరేస్తాం
భవిష్యత్తు కాలదోసి నిర్లజ్జగా కాలరెగరేసి
ఘన చరిత పుత్రులం
విద్వంసాల బాట నడిచేటి ఘన చరితులం

తల్లి వద్దు తండ్రి వద్దు
వాళ్ళు కన్న కలలు అసలే మాకొద్దు
ప్రతి ఉదయం ఒక సంగ్రామం
ఇదే మా జీవనయానం
కుటిల రాజకీయుని అరుపులే మాకు శంఖారావం
ఎవెడెక్కువ అరిస్తే వాళ్ళ దారిలో మే నడుస్తాం
ఉసికోల్పే మాటలకు మా ఎడ్రినలిన్ నిపుతాం
పురికొల్పే చేష్టలకు బస్సులను తగలెడుతాం

అనునిత్యం జరిగే విద్వంసాల హొరులో
నేలకోరగని నాయకుడు లేడులే
ఈ సంగతి నాకేరుకనే
అదే జరిగితే ఉసికొల్పే వాడెవ్వడు
మా రక్త నాళాలకు ఉపిరి నింపేదెవ్వడు

దేశ భాషలందు తెలుగు లెస్స
అన్న రాయలకి ఏమి తెలియదని నాకేరుకే
ఆయనకెరుకైతే తెలుగులో
భిన్న బాషలున్నాయని భిన్న సంస్కృతిలున్నాయని
రాయకుండా ఉండునా
అందులో ఏ తెలుగు రాస్తున్నాడో
చెప్పక మిన్నకుండునా!

ప్రతి ఉదయం TV9 తో మా స్నేహం
అది చూపే విధ్వంసాల దృశ్యాలే మాకిష్టం
పదికి ఇరువై మార్లు
ఒకే లొల్లి మార్చి మార్చి సాగతీసి చూపిస్తే
ఇరువై లొల్లిలు నే చేయక ఉందునా
కల్లబొల్లి మాటలలో నా జీవితం గడిపేయనా

ఇది నే సాధించిన మహా ప్రగతి
గడిచిన రేయిలో
మిగిలిపోయిన చీకటిలో
ఆవిరైన కలలను
కదల లేని ఆశల పల్లకిలో
భారంగా మోస్తున్న
ఈ తరపు ప్రతినిధులం
అయోమయపు యువకులం

10 comments:

Manjusha kotamraju said...

nijam chepparu

Anonymous said...

తెలంగాణ విద్యార్థులు గ్రూప్ వన్ పరీక్షలు రాయకుండా TRS వాళ్ళు అడ్డుపడ్డారు. మళ్ళీ ఈ అవకాశం ఇంకో పదేళ్ళకే వస్తుంది. అప్పటికి ఈ విద్యార్థులు ముసలివాళ్ళవుతారు. వాళ్ళ అవకాశాల్ని చెడగొట్టిన TRS తెలంగాణ ప్రయోజనాల పరిరక్షకులమని చెప్పుకుని సిగ్గులేకుండా తిరుగుతూంటే వీళ్ళు బుద్ధి లేకుండా వాళ్ళని నమ్ముతున్నారు.

Anonymous said...

జనాలకి 10ఏళ్ళకు గాని అవకాశం రాదు. ఇలాంటి చెత్త ఉద్యమాలు చేయకుంటే డిసెంబరులో తెరాస వాళ్ళు పీఠాలు ఎక్కలేరు. ఎవరిది ముందు? ఎవరికి తొందర?

Anonymous said...

మాది ధృతరాష్ట్ర కౌగిలి - ఊపిరాడక చావాల్సిందే మీరు!

సమైక్యతే మా మఖమల్‌ జెండా
ఖట్‌మలే మా లత్తకోరు ఎజెండా !

మా ఊళ్లల్లోని ఉద్యోగాలు మాకే
మీ ఊళ్లల్లోని ఉద్యోగాలు కూడా మాకే!
ఇదే మా దగుల్భాజీ నినాదం !

మీరు మాతో కలిసుండకపోతే లేదు మాకు దిక్కు
సమైక్యత అనగానే వస్తుంది మాకు ఎనలేని కిక్కు !

వడ్డించేవాడు మా వాడు
అధికారం చెలాయించేది మా వాడు
ఇంటర్వ్యూ చేసేది మా వాడు
రాత పరీక్షలో మాకు తక్కువ మార్కులొచ్చినా
దొడ్డిదారిలో ఉద్యోగాలన్నీ మాకే వస్తాయి
అరవై ఏళ్లుగా ఇది నడుస్తున్న చరిత్ర

మీరు రాత్రింబగళ్లు చదివి పరీక్షలు రాయండి
తల్లిదండ్రులతో కట్టగలిసి రాత్రి కలలు -
పగటి కలలు ఎన్నైనా కనండి కానీ
అన్యాయం జరిగిందని అరచి గోల చేస్తే మాత్రం
మక్కెలిరగ తంతాం !

మీరు మాట్లాడేది చెత్త తెలుగు
అయినా అదే మాకు వరం అయింది
మీకు శాపం అయింది
సమైక్యతకు అదే ఆధారం అయింది !

మీరు మానుంచి విడిపోయి
మీ ఉద్యోగాలు మీరు దొబ్బేద్దామనుకుంటున్నారేమో...
అసంభవం ...
వదల బొమ్మాలీ వదల...
వదలం తెలంగాణా నిన్ను వదలం
మీరు మా పల్లకిని శాశ్వతంగా మోస్తూ వుండాల్సిందే

- యాదగిరి

Anonymous said...

yadagiri anna,
khatarnak cheppinav.

Anonymous said...

సమైక్యతే మా మఖమల్‌ జెండా
ఖట్‌మలే మా లత్తకోరు ఎజెండా !

మా ఊళ్లల్లోని ఉద్యోగాలు మాకే
మీ ఊళ్లల్లోని ఉద్యోగాలు కూడా మాకే!
ఇదే మా దగుల్భాజీ నినాదం !

మీరు మాతో కలిసుండకపోతే లేదు మాకు దిక్కు
సమైక్యత అనగానే వస్తుంది మాకు ఎనలేని కిక్కు !

మేఘ said...

ఇప్పుడు సమైఖ్యమా ప్రత్యేకమా అన్నది కాదు సమస్య వచ్చిన ఒకానొక అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్న అవివేకం ఇది. ఇలా చేసి పరోక్షంగా ఆంధ్రా వాళ్ళకి ఉద్యోగాలు కట్టపెడుతున్నారు. ప్రతి నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు ఒకళ్ళు బొమ్మ అన్నారు మరొకరు బొరుసు అన్నారు. బొమ్మ పడే వరకు ఆత్రుతగా ఎదురు చూడాలి కాని ఉపిరి ఆపి ఎదురు చూస్తే బొమ్మ పడినా అది చూడటానికి మనం మిగలం. తల నొప్పి వచ్చిందని మాత్ర వేసుకుంటాం కాని ఇంకోటి చేయం కదా. ఇప్పుడు ఇంకోటే చేస్తున్నాం. ఇంతెందుకు అంత కల్లోలం ఎగిసి పడుతున్న కాశ్మీరం లోను పోలీసు ఉద్యోగాలు పడితే 60000 apply చేసారు అది ఉద్యోగానికున్న విలువ. అలా కాదు ఇప్పుడు చేస్తున్నదే ముద్దు అంటే ఎవరు ఏమి చేయగలం?

sunilbharat said...

10 సంవత్సరాల కాలం వ్యర్ధం ఐన పర్లెదు తల్లి తండ్రుల కలలు కల్లలైన పర్లెదు మెం ఉద్యమం కోసం ఉద్యోగాలు కూడా వదులుకుంటాం అవసరమమైతె ప్రాణాలు కూడా వదులుకుంటాం అనేవాళ్ళని శ్రీ క్రిష్ణ కమిటి కాదు కద సాక్ష్యత్తు క్రిష్ణ
పరమాత్మ వైకుంటం నుంచి దిగి వచ్చినా బాగు చెయ్యలేడు

భాస్కర రామిరెడ్డి said...

మేఘ గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు

హారం

మేఘ said...

bhaskar thankyou so much for the wishes.