నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Thursday, February 12, 2009

నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 20

----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------





చెంతనున్న గమ్యం తరగని దూరమిది
పక్కనే నిలుచున్న పలకరించలేని మనసే నాది
సమాంతరపు రేఖల ఉత్తర దక్షిన ద్రువాల పయనమిది
ఎవ్వరికి అర్దమే కాని వైనం మనది

ఒక క్షణం నవ్వుకుంటాను
మరు క్షణం ఎడ్వలేక నవ్వుతుంటాను
కనిపించే నవ్వు చాటున
నగుబాటు మిగిలినదని ఎన్నటికి తెలుపగలేను

తెలుపే చూశాను నీ మనసే అనుకున్నా
తీరం నాదే అనుకొని పరుగే నే తీసాను
చెంత చేరగానే ఏడు రంగుల కలయిక నే చూసి
చూస్తూ నే నిలుచున్నా
కదలని నను చూసి
నే దరిచేరలేని తీరాలు నివు చేరుకున్నవు
నీ ఞ్నపకాల నీడలో దారి కానరాక నే మిగిలిపోయాను

--మేఘ

Wednesday, February 4, 2009

నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 19

----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
ఎండిపోయిన ఆకులా ఎగెరెగిరి పడమాకే
అందలాలు ఎన్నటికి నీవు చేర లేవులే
గాలి వానలో చిక్కిఉన్న శిల్పమా
ఎడారి దారిలొ మిగిలిపోయిన ప్రాణమా

మనసే అలిగింది మమతే కరిగింది
ఆశల ఆవిరిలో నీవు ఎదురవుతావనుకుంటే
గాయమే మిగిలింది కాలమే నవ్వింది
కలనే కరిగింది కనులు తెరిచి చూస్తే
తెల్లారిపోయింది చెరల్సిన గమ్యం జీవితమై మిగిలింది
ఓ ప్రాణమా !!

ఇదే జీవితమని గడిపేస్తున్నాను
గడియ గడీయ గతం తలుపు తడుతుంటె
అలవాటుగా మార్చుకున్నాను
కదిలిపోయే కోయిల చూసి గడిచిన వస్తంతపు ~ఞ్నాపకం నను తాకగా
అది కల అనుకొని సరిపెట్టుకుందామనుకుంటే
కలవరపాటు మనసుకు మిగిలిందీ !!!!

నవ్వుతున్నావా నడి సంద్రపు నావలో నను చూసి
నీ నీడే ఒకానాడు నేనని మరిచి నవ్వుతున్నవా
ఓడిపోయానని నను చూసి గేలి చెసి నవ్వుతున్నవా
రేపెవరు చూడవచ్చారులే
నడి సంద్రపు ఈ నావ కుడా తీరమే చెరునేమోనే

కాలం నీవు చెసిన గాయం మానుఫుతుందేమొ
అని ఎదురు చూస్తుంటా వేయీ కళ్ళతో
గుండె భరువు కాసింతా తీరునేమోనని ఆశగా చూస్తున్న నిశీధీ శూన్యం లోకి
జలపాతాలు దాటను అమావాస్యలు గడిపాను
పున్నమిరెయిలెన్నడో మరిచాను
నీ ఞ్నాపకలన్నీ చిరునామ అయి మిగిలిపొయేనులే
నవ వసంతం యుగాంతంలో కూడ నే చూడలేనులే

--మేఘ