నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Monday, April 6, 2009

నా మనసు చెబుతోంది ఓ మనోగతం -23

----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------





ఒక రాగం పలికింది
నా మనసు నీ కోసం పలికిన అనురాగపు స్వరగానమే ఈ లాహిరి
మమకారం కురిసింది
వసంత గాలుల ఉల్లసానికి నా ఊహలు
ఊపిరి పోసిన ఇంద్రధనస్సు రంగుల చిత్రమిది

మన సహచర్యపు ఊసులను రాసులుగా
ఏర్చి కూర్చి సాయం సమయాన ఓ కోయిలమ్మకు
ఊసులుగా అందిస్తే చలచల్లన్నీ గాలులతో మెలమెల్లగా
అడుగులేసి తీరాలు దాటుకొని వేణుగానపు
సుమహారమై మనోహరపు కవ్యరాశిగా
నీ దరి చేరే సమయం కోసం
నా మనసు నిండిన నిను తలచుకొని ఎదురు చూస్తుంటా!

మిగిలిపోయినదే ఞ్నపకం
కరిగిపోయిన కాలంలొ మిగిలినదే కలవరం
ఆ చిరునామయే మన గతం
తోడుగా మిగిలినది నా మనోగతం
స్వగతాలు తలుస్తుంటా
నిశీధి సమయాలు అలవోకగా దాటేస్తుంటా
తెలతెలవారే వేల కోసం
క్రోసుల కొలది ఈ దూరం
కోయిల పాట లాంటి నా మనోగతంతో
పల్లవి చేసి పాడేస్తుంటా!!

--మేఘ