నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Thursday, February 24, 2011

నక్సలైట్లు వినీల్ కృష్ణని ఎత్తుకెళ్ళి మంచి పనే చేసారు

నక్సలైట్లు వినీల్ కృష్ణని ఎత్తుకెళ్ళి మంచి పనే చేసారు
అవును మరి వాళ్ళు ఎత్తుకేళ్ళకుండా ఉంటె ఇంతటి నిజాయితీ ఉన్న ఐఏఎస్ లు ఇంకా మన దేశం లో ఉన్నారని తెలిసేదే కాదు. మన వార్తా పత్రికలూ కూడా ఎప్పుడు 360 కోట్లు అవనితి సంపాదన పొందిన ఐఏఎస్ ల గురించే హెడ్డ్ లైన్స్ లో ప్రచురించడం మాత్రమే తెలిసిన వార్తా పత్రికలకి ఒక నిజయితిపరుడైన అధికారి వార్త ప్రచురించే భాగ్యం కలిగి ఉండేది కాదు.
ఏదో ఒక AD లో మరక మంచిదే అని ఉంటుంది.మరక వల్ల ఏదైనా ఒక మంచి జరిగితే అది మంచిదే. అలానే ఈ నక్సలైట్లు వినీల్ కృష్ణని ఎత్తుకెళ్ళడం వల్ల యావత్ భారతావనికి అతని గొప్పదనం తెలిసే భాగ్యం కలిగింది. ఈ సందర్భం లో అక్కడి ప్రజానీకం తెలిపిన సంఘీభావం ఎంతో ముదావహం. అదే సమయంలో మీడియా కూడా ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు TRP ratings కోసం తాపత్రయ పడే వీళ్ళు ఇటువంటి అధికారులు చేసే మంచి పనులు వెలుగులోకి తీసుక రావడం లో ఎందుకు ముందు ఉండరు. ఈ వరవరరావు పనికి మాలిన రావులను ఎందుకు చూపించి జనాల BP లను ఎందుకు పెంచుతారో వారికే అర్ధం కావలి. వాళ్ల వల్ల ఒనకుడిన ఒక్క ప్రయోజనం ఎవరికైనా ఉందా. మైకు ముందు పనికిరాని పక్షపాత పూరిత వక్ర మాటలు తప్పించి.
ఓడిషా ప్రభుత్వం కూడా మరీ విషయాన్ని సాగదీయకుండా వల్ల డిమాండ్లు ఒప్పుకొని సమయోచితంగా ప్రవర్తించింది. ఇటువంటి నిజాయితీ అధికారుల్ని తాయారు చేయడం అంతటి సామాన్య విషయం కాదు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడుతారు.
I salute to Mr vineel krishna with high regard

Tuesday, February 15, 2011

ఎండమావిలో దాహం



సాగిపోతున్నా!
కనిపించే దారులు
కరిగిపోని ఇసుక తెన్నలు
మిగిలిపోఇన జ్ఞాపకాలు
గత జల సేతు బంధనమంటూ
అడుగులు సాగదీస్తూ
కాలం గడిపేస్తూ సాగిపోతున్నా!

ఉసులు మూగపోయిన సాయంత్రాన
చుక్కల్లో లెక్కలు నెమరు వేస్తూ
ప్రతిరోజు నను తాకిపోయే సంధ్య వెలుగు
తన గూడు చేరిందని తెలుసుకొని
భారమైన కనులు చేమ్మగిల్లడం మరిచిపోలేదని
ఉబుసుపోని మనసుకు
జోలపాట పాడి రోజులు సాగదీస్తున్నా !

ఒంటరి మనసుని బంధిచే పాశం ఉన్నదా
బహుదూరపు బాటసారికి దరిచేర్చే తీరం ఉన్నదా
మారనిదల్లా నిన్న నేడు ఆశలు రేపే రేపు అన్న ఒక గూడు మాత్రమే
తీరనిదల్లా ప్రతి తీరం వెంట ఎండమావిలో దాహం మాత్రమే

Monday, February 7, 2011

ఓడి గెలిచిన చిరంజీవి

అనగనగా ఒక సారు, ఆయన దగ్గర కోటాను కోట్లు సంపద ఉంది ప్రజాబలము ఉంది. కావలసినంతా వందమాగధులు ఉన్నారు. ఏదో చేయాలనీ ఆయన మనసు ఎంతకాలం నుంచో ఉవ్విళ్లూరుతోంది కాని ఏమి చేయాలో ఆయనకు పాలు పోలేదు.చేయల్సిందతా చేసేసాడు, కొడుక్కి, తమ్ముడిని మండలాలు పంచిచ్చేసాడు. ఇన్ని ఉన్నచోట బట్రాజు గణానికి కొదవే లేదు. ఇంతకంటే లాభసాటిగా ఒక కంపెనీ పెట్టు సారు దానిలో లాభపడ్డ వారే కాని పడిపోయిన వాళ్ళేవ్వరూలేరు. నిజమేనని నమ్మాడు అమాయక చక్రవర్తి. నమ్మకేమి చేస్తాడు ఏదో ఒకటి చేయాలన్న తొందర ఆయనలో చాల ఉంది. పైగా live examples కూడా చాలానే ఉండనయే, అంతకు మునుపు ఒక అన్న కూడా ఇలానే ఒక చక్రం కూడా తిప్పడాయే! ఆయన 9 నెలల్లో చేస్తే నీవు 8 చేస్తావన్న వాళ్ళే ఎక్కువయ్యారు. ఇంకేంటి అమ్ములపొది సిద్దం చేసుకున్నాడు సామాజిక అంశం, ప్రేమే దైవం సేవే లక్ష్యం వందకు వంట చెరుకు ప్రోడుక్ట్స్ అన్ని సిద్దమయ్యాయి


ఇదంతా ఒక రెండేళ్ళ ముందటి కథ. రేపెవ్వడు చూడోచ్చాడు. కలలు కల్లలయ్యాయి. ఓడలు బండ్లు అయ్యాయి.కన్న కలలన్ని కుదేలయ్యాయి. టైటానిక్ సినిమా చూడలనుకుంటాడు కాని టైటానిక్ షిప్ లో ఎవ్వడు ప్రయాణించాలనుకోడు కదా అదే జరిగింది. పెట్టిన కంపెనీ ఢమాలయ్యింది . ఉన్న సరకు మురుగుపోతోంది ఏం చేయాలో తోచలేదు. రంగు పడి రంగు బారిన మొహం, మద్య మద్యలో రంగు వేసుకున్నోళ్ళు ఆకాశామార్గంలో విహరించడం కూడా మనసుకు ఉండబట్టకుండా చేసింది.పది దార్లు మూసుకపోతే ఒక దారి దేవుడు తెరుస్తాడాంట, ఊపిరి ఆడటానికి. ఎవరి కంపెనీకి పోటిగా తను దుకాణం తెరిచాడో ఆ పెద్ద కంపనీలో మేనేజర్ పోస్ట్ ఒకటి కాళి అయ్యింది అని తెలిసిందీ తడవుగా తొంగి చూడటం మొదలెట్టాడు. నీ స్థాయికి తగింది కాదన్నయ్య అనే చెప్పే వాడెవ్వడు లేకపోయే. ప్రతి ఒక్కడు బతకలేక బడిపంతులన్నట్టు గాలివాటంగా వచ్చిన వాడే కాని ఒక ఆలోచన పరుడే ఉంటే కదా.చెప్పే వాళ్ళే లేరు బట్రాజులు తప్ప. ఉన్నవాళ్లు ఎప్పుడో పోయారు, అదీ కాక రంగు వేసుకున్న మొహం కదా ఎక్కువ కాలం రంగు వేసుకోకుండా ఉండలేదు.రంగు వేసుకున్నప్పుడు అదికాక ఏదో వేరేది చేయాలన్న ఉబలాటం, కంపెనీ పెట్టాక రంగు వేయాలన్న ఆరాటం. ఎప్పుడు రెండు పడవల మీద కళ్ళు పెట్టే నైజమే! నీ ఆటే వద్దంటే పట్టుచీర కట్టుకోస్తా అని మొత్తానికి రంగ ప్రవేశం చేసాడు. అమ్ముడుపోని సరుకు అమ్మేశాడు. కాదు నమ్మకాన్ని వమ్ము చేసాడు. తిక్క సన్యాసులు అనుచరగణం.వాళ్ళకు మిగిలింది చిప్పే! కొట్లాటకు పుట్ట్లిలైన కాంగిరేసు కుటంబంలో కొత్త కాపురం మొదలెట్టిన ex ప్రజారాజ్యం గణానికి రాజ్య బాగం దక్కునో లేక ప్రజల్ని సామాజిక న్యాయం చేయమని ఈ అనుచరగణానికి ఇచ్చేసి రాజ్యాన్ని కాంగీయులు పంచుకుంటారో, వేచి చూడాలి.

ఒకానొక నాడు జెండా పీకేద్దాం అని శీర్షిక చూసి ఆంధ్రజ్యోతి పత్రిక ముందు నానా యాగీ చేసింది ఈ జనాలే. ఆత్మాహత్య సదృశమన్నట్టు పత్రికల మీద కారాలు మిరియాలు నూరింది ఈ నాయకుడే. హూట్!!!!! ఇంత తేలికగా మరి ఇంత ప్రయత్నలేమితో ఒక నాయకుడు ఓడిపోవడం సిగ్గుచేటు.ఇంతోటి నాయకుణ్ణి తివాసీలు వేసి నాయకత్వం అప్పగించడం కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టే. ఎవడైనా కంపెనీ CEO కంపెనీ మూసేసి opponent కంపెనీ లో మేనేజర్ పోస్ట్ కి సరిపెట్టుకున్నట్టుంది వ్యవహారం. కందకు లేని దురద కత్తి పీటకున్నట్టుగా అప్పుడప్పుడు ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెల్లో వార్తలు కోసమెళ్లి అరగంట Ad ప్రోగ్రామ్స్ చూసి వళ్ళు మండి వార్తలు ఆపినట్టు పోస్ట్ రాసి చల్లార్చుకోవడమే!