నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Monday, September 13, 2010

అనుకోకుండా అయ్యాను నేను సామంత రాజుని నేను-కాంగిరేసు మార్కు రాజకీయంతో

అనుకోకుండా అయ్యాను నేను సామంత రాజుని నేనూ!
నిర్ణయలేమి నా నైజం అనుభవమే నాకున్న బలము
గడిపేస్తాను ఆడేస్తాను పాలిస్తాను ఆంధ్రదేశాన్ని
కాంగిరేసు మార్కు రాజకీయంతో

ఎవరేమంటే ఏమి నాకేంటి సామి
నవ్వే టోళ్ళు నవ్వనీయని సామి
అరిచేటోల్లే అలిసిపోని సామి
దేవుడే చల్లంగుండా నా ఆరోగ్యం సక్కoగుండా
గడిపేస్తాను ఆడేస్తాను పాలిస్తాను ఆంధ్రదేశాన్ని
కాంగిరేసు మార్కు రాజకీయంతో

సామ్రాజ్ఞి అండ నా చెంత నుండ
ఆంధ్రా మన్మోహనుడంటూ పాడేటి భట్రాజులు నా తోడు ఉండ
తెలంగాణా వాదులు సీమంధ్రా నాయకులు కోట్లడుతూ ఉండ
జగన్మోహను ఓదార్పు చేస్తూ ఉండ
గడిపేస్తాను ఆడేస్తాను పాలిస్తాను

చెణుకులు చెడుగుడు ఆడేయ్యగలను
అసెంబ్లీలో విపక్షం నోటికి తాళం వేసేస్తాను
యువరాజు జన్మదినానికి ఆయన ఫోటోకే కేకు తినిపిస్తాను
అందివచ్చిన అవకాశము దేనినీ వదలను నేను

రేపన్నది ఎవడు చూడొచ్చాడు
రాజేవడో బంటు ఎవడో
ఈ దినము నాదేనన్న
చంద్రన్న బిక్క చచ్చి యాత్రలు చేస్తూ పోనీ
ముక్కు తిమ్మన ఆంధ్రా పార్టీ అంటూ చంద్రన్నని టార్గెట్ చేసేయని
రైతులు యూరియా అంటూ గగ్గోలు పెట్టని
గందరగోళం తింగరమేళం ఈనాడు నా రాజ్యం
చుక్కాని లేని నావకి ఎండిపోయిన పుల్లొకటి చుక్కాని అయిన వైనం

సామాజిక వాదం అంటూ ప్రజారాజ్యం స్థాపించి
అనుకోని సమయాన సమైఖ్యమంటూ
తత్తర బిత్తర పాటు మండాలాధీశుడు
నా బలము నీదేనంటూ పిలవని పేరంటానికి వస్తానంటూ
అయోమయపు నాయకులూ ఉన్నంత కాలం
ప్రతిదినము నాదేనన్న సామంత రాజుని నేనేనన్నా

ఇలా అనుకోకుండా అయ్యాను నేను సామంత రాజుని నేను
కాంగిరేసు మార్కు రాజకీయంతో
జీవితకాలపు స్వప్నాన్ని కలకు అందని ఉత్ధనాన్ని
పొందాను నేను కాంగిరేసు మార్కు రాజకీయంతో

Monday, September 6, 2010

ఉద్యమాలలో ఉన్న కిక్కు- ఉద్యోగాలలో లేదన్నా



ఉద్యమాలలో ఉన్న కిక్కు
ఉద్యోగాలలో లేదన్నా!
ఉద్యోగ వేటకై ఏళ్ళ తరబడి శ్రమ సైతం
లిప్త పాటున ప్రశ్నాపత్రాన్ని చింపేసి
వెనుతిరిగే యోధులం మేమన్నా!

OMR sheet ఒక్కేటున చింపేస్తాం
ప్రశ్నాపత్రం ఒక్క ఉపుతో విసిరేస్తాం
భవిష్యత్తు కాలదోసి నిర్లజ్జగా కాలరెగరేసి
ఘన చరిత పుత్రులం
విద్వంసాల బాట నడిచేటి ఘన చరితులం

తల్లి వద్దు తండ్రి వద్దు
వాళ్ళు కన్న కలలు అసలే మాకొద్దు
ప్రతి ఉదయం ఒక సంగ్రామం
ఇదే మా జీవనయానం
కుటిల రాజకీయుని అరుపులే మాకు శంఖారావం
ఎవెడెక్కువ అరిస్తే వాళ్ళ దారిలో మే నడుస్తాం
ఉసికోల్పే మాటలకు మా ఎడ్రినలిన్ నిపుతాం
పురికొల్పే చేష్టలకు బస్సులను తగలెడుతాం

అనునిత్యం జరిగే విద్వంసాల హొరులో
నేలకోరగని నాయకుడు లేడులే
ఈ సంగతి నాకేరుకనే
అదే జరిగితే ఉసికొల్పే వాడెవ్వడు
మా రక్త నాళాలకు ఉపిరి నింపేదెవ్వడు

దేశ భాషలందు తెలుగు లెస్స
అన్న రాయలకి ఏమి తెలియదని నాకేరుకే
ఆయనకెరుకైతే తెలుగులో
భిన్న బాషలున్నాయని భిన్న సంస్కృతిలున్నాయని
రాయకుండా ఉండునా
అందులో ఏ తెలుగు రాస్తున్నాడో
చెప్పక మిన్నకుండునా!

ప్రతి ఉదయం TV9 తో మా స్నేహం
అది చూపే విధ్వంసాల దృశ్యాలే మాకిష్టం
పదికి ఇరువై మార్లు
ఒకే లొల్లి మార్చి మార్చి సాగతీసి చూపిస్తే
ఇరువై లొల్లిలు నే చేయక ఉందునా
కల్లబొల్లి మాటలలో నా జీవితం గడిపేయనా

ఇది నే సాధించిన మహా ప్రగతి
గడిచిన రేయిలో
మిగిలిపోయిన చీకటిలో
ఆవిరైన కలలను
కదల లేని ఆశల పల్లకిలో
భారంగా మోస్తున్న
ఈ తరపు ప్రతినిధులం
అయోమయపు యువకులం