నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Tuesday, August 31, 2010

సిగ్గు లేని సమాజం నిర్లజ్జతో కూడిన వ్యవహారం

సిగ్గు లేని సమాజం నిర్లజ్జతో కూడిన వ్యవహారం
గురుత్వానికి ప్రాంతీయత ఆపాదించిన ఈ వైనం
ఎటువైపు మన పయనం
కల్లోల తీరాలను గమ్యంగా చేసుకొని
వడివడిగా అడుగులేస్తూ అక్కరకు రాని ఈ ఆవేశం

నా ప్రజలు నా భాష నా రాష్ట్రం అంటూ
ఎలుగెత్తి చాటరా అని బోధించిన మహనీయుల మాటల
ముత్యాల మూటలను మరిచిపోయి
కుత్సితం సంకుచిత్వం కల్లోలమే నా దారులంటు
ప్రతిరోజు ఒక విధ్వంసం
ఎటువైపు మన పయనం

గొడవ చేయడానికేది కాదు అతీతం అంటూ
అక్కరకు రాని ప్రతి విషయం రాద్దంతం చేస్తున్న
రాజకీయ నిరుద్యోగుల బడిలోన పాఠాలు నేర్చుకుంటూ
తప్పటడుగులు వేసుకుంటు కాలాన్ని వృధా చేస్తున్న యువతరం
కళ్ళు తెరిచి చూసెసరికి నడిమద్యన సూరీడు పడమట గడపకు
పయనమవడా
కాలినా చేతులకు ఆకుల కోసం వెతికేటి ప్రయాస
యువతకు మిగులునా?

స్మశానం నుంచి స్వర్గాన్ని సృష్టించిన
జపనీయుని నుంచి పాఠాలు నేర్వమేమి
శ్రమైక సౌందర్యంలొ ఆనందం దాగుందని
అద్భుతాలు సృష్టించి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న చైనా
అడుగుజాడలు చూడమేమి

విధ్వంసాలతో గడిపేటి ఏ తరము చరితలో
మసకబారక తప్పదని ఏ చరిత్ర చదివితే అర్ధమవునో కదా