నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Sunday, September 9, 2007

నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 7

నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 7
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయాన
సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-------------------------------------------------------------------
ప్రపంచంతో తెలుపుకోవాలనుకున్నా
నా మనసులోని బాధనంతా
కనులు తెరచి చూస్తే కనిపించే
జగమంతా నిశీధీ సమయాన

దాచుకోలేని బాధలతో
మదినిండా భారముతో
వెళ్ళదీయలేని బ్రతుకుని
సాగదీస్తున్నా ఓ అసమర్ధుని జీవితయాత్రని


దిక్కులన్నీ చూస్తున్నా
ప్రశాంతత దొరికే ఓ దిక్కు కోసం
ప్రపంచంతో నదుస్తున్నా
తొలగిపోలేదు నా ఈ ఒంటరితనం


కడలిలో నింపుతున్నా నా ఈ కన్నిళ్ళని
కాలంతో కలిపేస్తున్నా నా ఈ ప్రతిరోజుని
ఓ మనసా నీలొ గూడుకట్టిన బాధలు
తొలగే రోజు ఎన్నడూ?
నీ కళ్ళకు కలత లేని నిదుర దొరికేదెన్నడు?
--------------------
మేఘ
http://www.manogatam.blogspot.com
--------------------