నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Friday, August 29, 2008

నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 16

----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
నీవు నా కడ తోడు ఉంటే
గుండె చెఱువాయెనే
ఆ చెఱువు మమతలో నిండనే
నీ ఎడబాటు కలిగిన క్షణమే
అది కన్నీటి జలపాతమాయెనే
మనసే శాపమన్న నిజము
నీ ఎడబాటు నిజము చేసెనే
ఈ ఎదబాటే శాపమే

నిండుకుండ నింప సాధ్యమా
నిండుకున్న మనసుకి ప్రేమ దొరకడమే సాధ్యమా
ఈ ప్రేమ పిపాసి చేసే ఈ పయనము
వేసే ప్రతి అడుగు సాహసమే
నీ ప్రెమకోర నా మనసు చేసిన సాహసము
నీ ఎడబాటు చేసెనే దుస్సాహసము!

వలపు కల్లలాయెరా
కలలన్నీ పోయెరా
ఈ ఙ్ఞ్నాపకాల జాగురాతిరిలో
ఈ బ్రతుకే శివరాత్రిరా


ఈ మనసు రాయి కాదులే
మమత మాసిపోదులే
నీవు మరచిన ఙ్ఞ్నాపకాలన్నీనా మదిలో పదిలములే
ఈ భావనే మనసుకు దూరమైతే మనిషి కాదు మానునే
గాయమే రేపినా మమత వీడనాయెనేనే
మనిషిగా మిగిలిపోదునే

----------------------------
--మేఘ

Monday, August 18, 2008

నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 15

----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------

మరువగలిగితే అది మనసెందుకు అవుతుంది
మనసన్నది ఒక బాధల పందిరి
బహుకాలం క్రితము ఒక ఆశల పల్లకిలో
ఒక సుందర సుదూర స్వప్నంతో
మొదలెడిన ఈ పయనం చేరిన గమ్యం ఈ తీరం

నా మనోఫలకంపై చెరగని ముద్రలు వేసిన నీ ఞ్నాపికలు
క్షణక్షణం అనుక్ష్ణం అలజడి రేపె
ఆ రేపిన అలజడుల సుడిగుండాలలో
ప్రతిరోజు దాటేస్తున్నా ఈ నిశీధీ రాత్రులను
కాలమే భారమై గడిచేను
కానీ నీ ఞ్నాపకాలు కాదు సరికదా
దాని నీడను కూడాచెరపలేక
చెమ్మగిల్లిన ఈ కళ్ళతో నాలోని శోకసముద్రాలు
ఇంకెవరకూ రోదిస్తూ నిలుచున్నా!

ప్రేమ పరవశం పంచునన్నది ప్రేమ నానుడి
ఆ పరవశం కరిగాక పరితాపమే మనసుకు మిగిలేది
ఈ సత్యం తెలియక ముందున్నది వసంతమన్న భ్రమలోఈ తీరం చేరాను
కదలిపోని గ్రీష్మంలో కలతమాత్రమే నిండిన మనసుతో మిగిలున్నా

Sunday, August 17, 2008

నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 14

----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయాన
సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
ఓడేటి ఆటని ఆడేటి ఓ బాటసారీ
నీ ఆట ముగిసిపోయిందని తెలుసుకోవేమి
పరితాపం పొందేటి ఈ తపన దేనికి
అనుక్షణము గడిచిన గతాన్ని తలుచుకుంటావేమి

బాధలకు నీ గుండెల్లో ఆశ్రయం ఇంకా ఎన్నాళ్ళు
కడగండ్లు కనుల మాటున పరితపన ఇంకెన్నేళ్ళు
నీవు నడిచెటి ప్రతి దారి ఏడారికి రహదారి
ఈ సత్యం తెలిసుకొని నీ పయనాన్ని ఆపవేమి

గదిచిన గతమెన్నడు ఓ తీపి మధురము
గతకాలపు ఞ్నాపకము చేదు గుళిక రూపము
గతాన్నె తలుస్తూ ప్రతిదినము గడిపెటి నీ ఉదయం
ఎన్నడు చూడలేదు ఉషోదయం

ఓ బాటసారి నిన్ను ఎవరు మార్చలేరు
నీ ఏడారి దారిని ఎవరు మళ్ళించలేరు
ఎండమావులకై వెతుకుతూ దాహార్తితో కనుమరుగౌతావొ
ఏడారి దారుల వెంట ఇసుక తుఫానులలో సమసిపొతావొకాలమే నిర్ణయించని

నీవు సాగించె నీ పయనాన్ని నా కన్నులతొ చూస్తూ
నీ నీడగా నీ మనసునై అనుసరించని
అసహయుడనై అంతరాత్మగా మిగులున్నా!
సత్యాన్ని తెలిసి కూడ నీ దారి మళ్ళించలేని అశక్తుడనై నిలుచున్నా!
--మేఘ