సిగ్గు లేని సమాజం నిర్లజ్జతో కూడిన వ్యవహారం
గురుత్వానికి ప్రాంతీయత ఆపాదించిన ఈ వైనం
ఎటువైపు మన పయనం
కల్లోల తీరాలను గమ్యంగా చేసుకొని
వడివడిగా అడుగులేస్తూ అక్కరకు రాని ఈ ఆవేశం
నా ప్రజలు నా భాష నా రాష్ట్రం అంటూ
ఎలుగెత్తి చాటరా అని బోధించిన మహనీయుల మాటల
ముత్యాల మూటలను మరిచిపోయి
కుత్సితం సంకుచిత్వం కల్లోలమే నా దారులంటు
ప్రతిరోజు ఒక విధ్వంసం
ఎటువైపు మన పయనం
గొడవ చేయడానికేది కాదు అతీతం అంటూ
అక్కరకు రాని ప్రతి విషయం రాద్దంతం చేస్తున్న
రాజకీయ నిరుద్యోగుల బడిలోన పాఠాలు నేర్చుకుంటూ
తప్పటడుగులు వేసుకుంటు కాలాన్ని వృధా చేస్తున్న యువతరం
కళ్ళు తెరిచి చూసెసరికి నడిమద్యన సూరీడు పడమట గడపకు
పయనమవడా
కాలినా చేతులకు ఆకుల కోసం వెతికేటి ప్రయాస
యువతకు మిగులునా?
స్మశానం నుంచి స్వర్గాన్ని సృష్టించిన
జపనీయుని నుంచి పాఠాలు నేర్వమేమి
శ్రమైక సౌందర్యంలొ ఆనందం దాగుందని
అద్భుతాలు సృష్టించి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న చైనా
అడుగుజాడలు చూడమేమి
విధ్వంసాలతో గడిపేటి ఏ తరము చరితలో
మసకబారక తప్పదని ఏ చరిత్ర చదివితే అర్ధమవునో కదా
Tuesday, August 31, 2010
సిగ్గు లేని సమాజం నిర్లజ్జతో కూడిన వ్యవహారం
Wednesday, July 21, 2010
బాబు బాబ్లీయం
ఉగ్రవాదులు దాడులు తెగపడుతుంటున్నప్పుడు ఆక్రోశం కలుగుతుంది. మొన్న బాబ్లీలో జరిగిన దుశ్చర్య చూసి వాళ్ళ నుంచి అంతకంటే ఎక్కువ ఆశించడం అడియాసే అనిపిస్తుంది. కొందరికి ఇది బహుశా అతిశయోక్తి అలంకారం అనిపించి ఉండొచ్చు. మరికొంతమందికి ఒక అడుగు ముందుకు వేసి బహుశ నేను తెలుగుదేశం సానుభూతిపరుణ్ణీ కూడా అయిఉంటాను. బాబు బాబ్లీ యాత్ర చెపట్టిన టైమింగ్ సబబా కాద దానిలొ సరిపాళ్ళు ఎంత అన్న అంశాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. రాజకీయం అంటేనే ఒక అవకాశవాదం, వాళ్ళ నుంచి నేను అంతకన్నా ఆశించలేను బహుశా ఈ అడుగు దాటి మరో ఆలోచన చేయడానికి ఇది excuse కాదనుకుంటా!రాజకీయ నాయకులు సామన్య ప్రజానీకానికి ఆ విధంగా expectations, bench marks ఆల్రేడీ set చేసేసారు.
ఏదేమైనప్పడికి మహారాష్త్ర ప్రభుత్వం పాల్పడిన ఈ నియంత్రుత్వ పోకడలు నా ఊహ ఎరిగి కనీవినీ ఎరగను. రాజ్యంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో వ్యవహరించిన తీరు అందులోనూ మహిళా ప్రతినిధులతో అవమానించిన తీరు గర్హనీయం.మనలో మనకే ఇంత విద్వేషాగ్ని ఉన్నప్పుడు శత్రుదేశం అయిన పాకిస్థాను ఆ విధంగా దాడులు తెగబడటం వాళ్ళనుంచి మంచి ఆశించడం అత్యాశే.
ఇక్కడ జరిగిన ఈ సంఘటన నేటి రాజకీయాలలో కొత్త పోకడలకు నాంది. ఇది ఒక trend setter అయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది.మొన్న YSR చనిపోతే ఎందరో గుండెపోటుతో పోయారు.నిన్న బాబు అరెస్టు వార్త విని అదే గుండెపోటుతో చనిపోయారు.ఏంజరుగుతుందిక్కడ అని హరిక్రిష్ణ అన్నట్టు అరవాలనిపిస్తుంది కాని నేను రాజకీయ నాయకుడిని కానే.దేశం నాయకుల్ని ఎన్ని రకాలుగా అవమానించరో ఇక్కడ ప్రస్తావించడం చాట భారతాన్ని reprint చేసినట్టవుతుంది.
ఒక సమస్యను పలు రకాలుగా పరిష్కరించవచ్చు.ఆ మూఢులు దండం దశగుణం భవేత్ అని ప్రయొగించారు.ఇంత జరుగుతున్నా ఇక్కడ ప్రభుత్వం చేష్టలూడి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం తీవ్రమైన ఆశ్చర్యం కల్గిస్తుంది.రోశయ్య వాక్పటిమ అసెంబ్లీ లోనే కానీ ఒక కీలక తరుణంలో నిర్ణయలేమి ఆయన తత్వమో లేక నిస్సహయతనో లేక కాంగ్రెస్సు వాది కాదనో!
మన కేసియార్ కేమో ఎడారి భూమి అయినా సరే దానిపై తెలంగాణ అని బోర్డు చూసుకునే చాలు ఆయన జీవిత కాల స్వప్నం నెరవేరినట్టే రాజినామా కాకుండా ప్రజోపయోగ కరమైన ఉద్యమాలు ఏమి చేసాడొ నేనెరగను.
మొన్నటికి మొన్న సోంపేట లోనూ అదే తంతు.మన వాళ్ళను మనమే శిక్షించుకుంటున్నాం.మనం మావోయిస్టులను అంటున్నాం మనలోనే దాగున్న మావోయిజం గుర్తించలేకపోతున్నాం.ఎవరెవరి శక్తానుసారం వాళ్ళ సామర్ద్యాల అణుగుణంగా ఆటవిక న్యాయం చేయడమే మారుతున్న రాజకీయల అర్ధం అనుకుంటా!
నేనూ ఒక మనిషినే
నేనూ ఒక మనిషినే
నా దారిన నే పోతున్నా
నేనూ ఒక మనిషినే
పక్కవాడి వ్యధ నాకెందుకులే అనుకున్నా
నేనూ ఒక మనిషినే
నా పక్కన రావణకాష్టం రగులుతున్నా
చీమ చిటుక్కక్కమన్న భావన నాలొ లేకుండ నిలుచున్నా
నేనూ ఒక మనిషినే
నాకేమవసరమని నడుస్తున్నా
మాధ్యామల మంత్రజాలంలో రోజులనే గడుపుతున్నా
సినీమాల మాయలో కాలాన్ని వౄధా చేస్తున్నా
ల్యాప్ టాప్ బ్యాగ్ ని భుజానికెత్తుకోని
బడి పిల్లొడి మాదిరిగా ఆఫీస్ వెళుతున్నా
బాధన్నది నాకు లేదు
నా ప్రపంచం లో నేనున్నా
survival for fit test నేటికి కానవస్తున్నా
చలనమన్నది నాకు లేదు అలజడన్నది నాలొ లేదు
మనసుకే సున్నితత్వం పోయిందా
ఆలొచన కూడా చేయకుండా మౌనంగా మిన్నకున్నా
నేనూ ఒక మనిషినే
కంప్యూటర్ యుగపు నర రూప మర మనిషిని
Monday, September 28, 2009
మీ చీమల శ్రేయోభిలాషి..
మొన్నీమద్యనే ఇంకో friend room లోకి shift అయ్యా! అందరూ కుక్క, పిల్లి పెంచుకుంతారు కాని మా స్నేహితుడు చీమలు పెంచుకుంటున్నాడు. అప్పుడనిపించింది,తాను india కి వెళుతూ నన్ను ఎందుకున్నమన్నాడో అని, US లొ చీమలు చూడటo బహుశా మొదటిసారి కాబోలు అందుకే పెంచుకుంటున్నాడు అని అభిప్రాయం కలగచేసింది:) వాటికి నేనంటే ఎంత ప్రేమనో మాటల్లో చెప్పలేను. వంటగదిలో నేనేపని చేసిన చేయనీకుండా నా చుట్టు చేరుకపోతాయి. అందుకే నేను వాటిని అంతే ప్రేమతో feed చేస్తున్నా. తాను india నుంచి వచ్చేసరికి he ll be proud of them.ఎందుకంటే అవి తాను మా friend గుర్తుపట్టలేనంత పెరిగి పెద్దైపోతాయి కదా..వాటిని చూసి గర్వపడుతాడు.అప్పుడు నా బాధ్యత తీర్చుకొని బయటపడొచ్చు
Sunday, September 13, 2009
కొన్ని కబుర్లు అవీ ఇవీ ..
ఎప్పుడైనా పేపర్ చదివినపుడు ఎప్పుడు అర్ధం కాని విషయం ఏమైన ఉంది అంటే రాజకీయ నాయకులు నా వాఖ్యలు వక్రీకరించారు అని ఒక statement ఇచ్చినపుడు. అదేంటో వాళ్ళేపుడు mediaకి అర్ధం అయ్యే వాఖ్యనాలు చేయరెందుకో!
ఈ మధ్య మా మిత్రుడొకరు India కి వెళ్ళడం జరిగింది. విషయాలు చెప్పుకొస్తూ హైదరాబాదు Ameerpet గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఇప్పుడెవరు అక్కడ coaching తీసుకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కనిపించడం లేదు అని విన్నప్పుడు ఔరా కాలం ఎంతగా మారిపోయింది అని అప్పుడనిపించింది.US లొ ఇప్పుడున్న తెలుగు జనాభలో నూటికి తొంభై మంది హైదరాబాదు Ameerpet లొ నడక నెర్చుకొని వచ్చారంటె అతిశయోక్తి లేదేమో.
2000 DOTCOM bubble burst ని కూడా తట్టుకొని నిలబదగలిగింది కానీ ఈ ఆర్ధిక మాంద్యం దెబ్బకు కుప్పకూలిపోయింది ఆ రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి ఆ center ఎంత busy గా ఉండేదో. ఉదయం పూట tiffin centers హడవిడి మొదలుకొని road లొ నడిచె వెళ్ళేవాళ్ళకు వొద్దొన్నా pamphlet ఇచ్చేవాళ్ళ జీవనోపాది ఏమైందో కదా. కాలగమనంలో ఇవన్ని మాములేనేమో.
మొన్నామధ్య ఒక పాట వినడం జరిగింది, నేను మాములుగా పాటలు తక్కువే వింటాను అది విన్నాక మళ్ళీ మళ్ళీ వినకుండ ఉండలేకపోయా. Current సినిమా లో అటు నీవే ఇటు నీవే అనే పాట.. ఇదేమి పెద్ద సంగతి కాకున్న మనకు నచ్చిన విషయం పదిమందితొ పంచుకునే ఆనందమే వేరుగా!
ఇంకేమి ఆసక్తికర విషయాలు ఏమీ లేవు .. సెలవా మరి!
Tuesday, August 25, 2009
నీ తోడుగా ...
నేనుంటా! నీ తోడుగా నేనుంటా
నీరెండల్లో నీడల్లే నీ వెనకెనకే నేనుంటా
వానల్లో కురిసిన చిరుజల్లుల్లే
ఆనందాన్నై నీ వెంటగా నేనుంటా
వసంతపు కోయిల గానంలో
ఊపిరిగా నీ శ్వాసల్లొ నే మిగిలుంటా
నీ కళ్లల్లో కాంతిని చూసేటందుకు
పగలల్లే సూరీడు వెలుగునే నే తీసుక వొస్తా
సొలసిన మనసుకి తాపం తీరెటందుకు
రేయిల్లొ వెన్నలనే ఆకాశంలో దాచేస్తా
తీయని భావన పేరే ప్రేమైతే
దానిని కానుకగా నీకిస్తా
విరబూసిన నీ నవ్వులకు
పువ్వులే పోటీ వొస్తే
నీ జడ కుచ్చుళ్లో వాటిని దాచేస్తా
సొలసిన కనులకు అలసట వొస్తే
నిద్రల్లే నీలో నేనుంటా
పగలు రేయీ తేడా లేక
ఒకటే ధ్యాస అది నాలో మిగిలిన నీపై ఆశ
Monday, April 6, 2009
నా మనసు చెబుతోంది ఓ మనోగతం -23
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
ఒక రాగం పలికింది
నా మనసు నీ కోసం పలికిన అనురాగపు స్వరగానమే ఈ లాహిరి
మమకారం కురిసింది
వసంత గాలుల ఉల్లసానికి నా ఊహలు
ఊపిరి పోసిన ఇంద్రధనస్సు రంగుల చిత్రమిది
మన సహచర్యపు ఊసులను రాసులుగా
ఏర్చి కూర్చి సాయం సమయాన ఓ కోయిలమ్మకు
ఊసులుగా అందిస్తే చలచల్లన్నీ గాలులతో మెలమెల్లగా
అడుగులేసి తీరాలు దాటుకొని వేణుగానపు
సుమహారమై మనోహరపు కవ్యరాశిగా
నీ దరి చేరే సమయం కోసం
నా మనసు నిండిన నిను తలచుకొని ఎదురు చూస్తుంటా!
మిగిలిపోయినదే ఞ్నపకం
కరిగిపోయిన కాలంలొ మిగిలినదే కలవరం
ఆ చిరునామయే మన గతం
తోడుగా మిగిలినది నా మనోగతం
స్వగతాలు తలుస్తుంటా
నిశీధి సమయాలు అలవోకగా దాటేస్తుంటా
తెలతెలవారే వేల కోసం
క్రోసుల కొలది ఈ దూరం
కోయిల పాట లాంటి నా మనోగతంతో
పల్లవి చేసి పాడేస్తుంటా!!
--మేఘ