----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
చెంతనున్న గమ్యం తరగని దూరమిది
పక్కనే నిలుచున్న పలకరించలేని మనసే నాది
సమాంతరపు రేఖల ఉత్తర దక్షిన ద్రువాల పయనమిది
ఎవ్వరికి అర్దమే కాని వైనం మనది
ఒక క్షణం నవ్వుకుంటాను
మరు క్షణం ఎడ్వలేక నవ్వుతుంటాను
కనిపించే నవ్వు చాటున
నగుబాటు మిగిలినదని ఎన్నటికి తెలుపగలేను
తెలుపే చూశాను నీ మనసే అనుకున్నా
తీరం నాదే అనుకొని పరుగే నే తీసాను
చెంత చేరగానే ఏడు రంగుల కలయిక నే చూసి
చూస్తూ నే నిలుచున్నా
కదలని నను చూసి
నే దరిచేరలేని తీరాలు నివు చేరుకున్నవు
నీ ఞ్నపకాల నీడలో దారి కానరాక నే మిగిలిపోయాను
--మేఘ
Thursday, February 12, 2009
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 20
Wednesday, February 4, 2009
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 19
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
ఎండిపోయిన ఆకులా ఎగెరెగిరి పడమాకే
అందలాలు ఎన్నటికి నీవు చేర లేవులే
గాలి వానలో చిక్కిఉన్న శిల్పమా
ఎడారి దారిలొ మిగిలిపోయిన ప్రాణమా
మనసే అలిగింది మమతే కరిగింది
ఆశల ఆవిరిలో నీవు ఎదురవుతావనుకుంటే
గాయమే మిగిలింది కాలమే నవ్వింది
కలనే కరిగింది కనులు తెరిచి చూస్తే
తెల్లారిపోయింది చెరల్సిన గమ్యం జీవితమై మిగిలింది
ఓ ప్రాణమా !!
ఇదే జీవితమని గడిపేస్తున్నాను
గడియ గడీయ గతం తలుపు తడుతుంటె
అలవాటుగా మార్చుకున్నాను
కదిలిపోయే కోయిల చూసి గడిచిన వస్తంతపు ~ఞ్నాపకం నను తాకగా
అది కల అనుకొని సరిపెట్టుకుందామనుకుంటే
కలవరపాటు మనసుకు మిగిలిందీ !!!!
నవ్వుతున్నావా నడి సంద్రపు నావలో నను చూసి
నీ నీడే ఒకానాడు నేనని మరిచి నవ్వుతున్నవా
ఓడిపోయానని నను చూసి గేలి చెసి నవ్వుతున్నవా
రేపెవరు చూడవచ్చారులే
నడి సంద్రపు ఈ నావ కుడా తీరమే చెరునేమోనే
కాలం నీవు చెసిన గాయం మానుఫుతుందేమొ
అని ఎదురు చూస్తుంటా వేయీ కళ్ళతో
గుండె భరువు కాసింతా తీరునేమోనని ఆశగా చూస్తున్న నిశీధీ శూన్యం లోకి
జలపాతాలు దాటను అమావాస్యలు గడిపాను
పున్నమిరెయిలెన్నడో మరిచాను
నీ ఞ్నాపకలన్నీ చిరునామ అయి మిగిలిపొయేనులే
నవ వసంతం యుగాంతంలో కూడ నే చూడలేనులే
--మేఘ
Saturday, January 31, 2009
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 18
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
కాలమే గాయమై మౌనంగా నిలుచున్నా
భారమైన మనసుతో ముందుకు సాగిపొతున్నా
ఎక్కడైనా తారసపడుతావేమోనని
అటు ఇటు చూస్తున్నా
గాయల గాలంలో కదలలేక మిగిలున్నా
తలపులన్నీ గతకాలపు చిరునామాగా
మిగిలిపోయేనే నీటిమీద రాతలుగా!
కరువు నిండిన సీమను
దాహర్తిని తీర్చీ తుఫాను హోరులా
వేదన నిండిన నా మనసుని
తాకదా ప్రేమ నింపే ఓ పరిమళ పుష్పం ఒకటీ
నీ సాహచర్యం నాలో పరవశం
నింపెనేమొ తెలియదు కానీ
నీ ఎడబాటు నా ఎదలో అంతులేని అగాధం నింపనే
ఆ అగాధంలో కన్నిటి జలధారలు నింపినా
అంతులేని విషాధం ప్రతిబింబమై కళ్ళెదుట నిలిచెలే
--మేఘ
Sunday, September 21, 2008
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 17
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
ఆ రోజులు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి
నీవు నా నుంచి దూరమవుతున్న క్షణాలు
ఇకపై నేననుభవించే
విరహ వేదనల ఎడబాటు రోదనలు..
రోజులు గడుస్తున్నా నను వీడని
గతకాలపు హ్రుదయ ఆక్రందనలు
ఆ రోజులు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి !
కాలం మారింది రోజులు భారమయ్యాయి
నా హ్రుదయ వేదన చూసి పరితపన చెందిన
పువ్వులు వాడిపొయాయి
నా గుండె బాధలు తీరలేదు
ఆ రోజు ఏర్పదిన గుండె గాయం
నేటికీ మానలేదు
విహంగాలు దాటాను
సముద్రాలు దాటాను
కానీ నా మనసు నుండి నే దూరమవలేకపోయాను
నా మనసులో నిలిచిపోయిన
నిన్ను నీ జ్ఞాపకాలను
నే దూరం చెయలేక పోయాను
కాలం గడిస్తే బాధలు తీరిపోవునంటారు
వేదనలు తొలిగి పోవునంటారు
అన్నవాళ్ళెవ్వరూ ప్రేమించిన ఉండరేమో
ప్రేమించి ప్రేమలో రోదించిన వారెవ్వరు
మౌనంలో మూగబోక మానరు
--మేఘ
Friday, August 29, 2008
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 16
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
నీవు నా కడ తోడు ఉంటే
గుండె చెఱువాయెనే
ఆ చెఱువు మమతలో నిండనే
నీ ఎడబాటు కలిగిన క్షణమే
అది కన్నీటి జలపాతమాయెనే
మనసే శాపమన్న నిజము
నీ ఎడబాటు నిజము చేసెనే
ఈ ఎదబాటే శాపమే
నిండుకుండ నింప సాధ్యమా
నిండుకున్న మనసుకి ప్రేమ దొరకడమే సాధ్యమా
ఈ ప్రేమ పిపాసి చేసే ఈ పయనము
వేసే ప్రతి అడుగు సాహసమే
నీ ప్రెమకోర నా మనసు చేసిన సాహసము
నీ ఎడబాటు చేసెనే దుస్సాహసము!
వలపు కల్లలాయెరా
కలలన్నీ పోయెరా
ఈ ఙ్ఞ్నాపకాల జాగురాతిరిలో
ఈ బ్రతుకే శివరాత్రిరా
ఈ మనసు రాయి కాదులే
మమత మాసిపోదులే
నీవు మరచిన ఙ్ఞ్నాపకాలన్నీనా మదిలో పదిలములే
ఈ భావనే మనసుకు దూరమైతే మనిషి కాదు మానునే
గాయమే రేపినా మమత వీడనాయెనేనే
మనిషిగా మిగిలిపోదునే
----------------------------
--మేఘ
Monday, August 18, 2008
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 15
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
మరువగలిగితే అది మనసెందుకు అవుతుంది
మనసన్నది ఒక బాధల పందిరి
బహుకాలం క్రితము ఒక ఆశల పల్లకిలో
ఒక సుందర సుదూర స్వప్నంతో
మొదలెడిన ఈ పయనం చేరిన గమ్యం ఈ తీరం
నా మనోఫలకంపై చెరగని ముద్రలు వేసిన నీ ఞ్నాపికలు
క్షణక్షణం అనుక్ష్ణం అలజడి రేపె
ఆ రేపిన అలజడుల సుడిగుండాలలో
ప్రతిరోజు దాటేస్తున్నా ఈ నిశీధీ రాత్రులను
కాలమే భారమై గడిచేను
కానీ నీ ఞ్నాపకాలు కాదు సరికదా
దాని నీడను కూడాచెరపలేక
చెమ్మగిల్లిన ఈ కళ్ళతో నాలోని శోకసముద్రాలు
ఇంకెవరకూ రోదిస్తూ నిలుచున్నా!
ప్రేమ పరవశం పంచునన్నది ప్రేమ నానుడి
ఆ పరవశం కరిగాక పరితాపమే మనసుకు మిగిలేది
ఈ సత్యం తెలియక ముందున్నది వసంతమన్న భ్రమలోఈ తీరం చేరాను
కదలిపోని గ్రీష్మంలో కలతమాత్రమే నిండిన మనసుతో మిగిలున్నా
Sunday, August 17, 2008
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 14
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయాన
సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
ఓడేటి ఆటని ఆడేటి ఓ బాటసారీ
నీ ఆట ముగిసిపోయిందని తెలుసుకోవేమి
పరితాపం పొందేటి ఈ తపన దేనికి
అనుక్షణము గడిచిన గతాన్ని తలుచుకుంటావేమి
బాధలకు నీ గుండెల్లో ఆశ్రయం ఇంకా ఎన్నాళ్ళు
కడగండ్లు కనుల మాటున పరితపన ఇంకెన్నేళ్ళు
నీవు నడిచెటి ప్రతి దారి ఏడారికి రహదారి
ఈ సత్యం తెలిసుకొని నీ పయనాన్ని ఆపవేమి
గదిచిన గతమెన్నడు ఓ తీపి మధురము
గతకాలపు ఞ్నాపకము చేదు గుళిక రూపము
గతాన్నె తలుస్తూ ప్రతిదినము గడిపెటి నీ ఉదయం
ఎన్నడు చూడలేదు ఉషోదయం
ఓ బాటసారి నిన్ను ఎవరు మార్చలేరు
నీ ఏడారి దారిని ఎవరు మళ్ళించలేరు
ఎండమావులకై వెతుకుతూ దాహార్తితో కనుమరుగౌతావొ
ఏడారి దారుల వెంట ఇసుక తుఫానులలో సమసిపొతావొకాలమే నిర్ణయించని
నీవు సాగించె నీ పయనాన్ని నా కన్నులతొ చూస్తూ
నీ నీడగా నీ మనసునై అనుసరించని
అసహయుడనై అంతరాత్మగా మిగులున్నా!
సత్యాన్ని తెలిసి కూడ నీ దారి మళ్ళించలేని అశక్తుడనై నిలుచున్నా!
--మేఘ