----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయాన
సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
ఓడేటి ఆటని ఆడేటి ఓ బాటసారీ
నీ ఆట ముగిసిపోయిందని తెలుసుకోవేమి
పరితాపం పొందేటి ఈ తపన దేనికి
అనుక్షణము గడిచిన గతాన్ని తలుచుకుంటావేమి
బాధలకు నీ గుండెల్లో ఆశ్రయం ఇంకా ఎన్నాళ్ళు
కడగండ్లు కనుల మాటున పరితపన ఇంకెన్నేళ్ళు
నీవు నడిచెటి ప్రతి దారి ఏడారికి రహదారి
ఈ సత్యం తెలిసుకొని నీ పయనాన్ని ఆపవేమి
గదిచిన గతమెన్నడు ఓ తీపి మధురము
గతకాలపు ఞ్నాపకము చేదు గుళిక రూపము
గతాన్నె తలుస్తూ ప్రతిదినము గడిపెటి నీ ఉదయం
ఎన్నడు చూడలేదు ఉషోదయం
ఓ బాటసారి నిన్ను ఎవరు మార్చలేరు
నీ ఏడారి దారిని ఎవరు మళ్ళించలేరు
ఎండమావులకై వెతుకుతూ దాహార్తితో కనుమరుగౌతావొ
ఏడారి దారుల వెంట ఇసుక తుఫానులలో సమసిపొతావొకాలమే నిర్ణయించని
నీవు సాగించె నీ పయనాన్ని నా కన్నులతొ చూస్తూ
నీ నీడగా నీ మనసునై అనుసరించని
అసహయుడనై అంతరాత్మగా మిగులున్నా!
సత్యాన్ని తెలిసి కూడ నీ దారి మళ్ళించలేని అశక్తుడనై నిలుచున్నా!
--మేఘ
Sunday, August 17, 2008
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 14
Sunday, June 8, 2008
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 13
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయాన
సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
ఉంటావే ఉంటావు
ఆనందంగా ఉంటావు
నా గుండెల్లో గునపాలు దింపి
కలకాలం నీవు ఆనందంగా ఉంటావ్!
నాతో అన్న మాటలు మరిచావు
నీ కంటి పాప నీడనే విడిచావు
కలలో ఇనా నిన్ను మరవలేక
ఈనాటికి నీ కలలే కంటున్నా
నిను నేను మరిచిపోక
కదిలిపోఇన నావ జాడ కోసం
నీళ్ళలో జాడ వెతుకుతూ ఇలా మిగులున్నా!
మాసిపొని గాయాన్ని నా గుండెకు చేసావు
ఓ తీరం నివు చేరి నను తలుచుకొని
నవ్వుతూ నిలుచున్నవు
ఊపిరి సాగినంత కాలం
నీ సాహచర్యం రేపిన గాయలు తలుస్తూ
నిన్ను తలుచుకొనినేను ఇలా మిగిలిపోతాను!
--మేఘ
Friday, April 18, 2008
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 12
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయాన
సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
సంక్రాంతి సంబరాలు చుడాలనిపిస్తే
అంబర వీదుల అంబరాలు అందుకోవాలనిపిస్తే
"ప్రీయతమా" నీ సాహచర్యం కోరనా ఓ సాయంత్రం
అంతులేని ఆనందం పొందనా ఆసాంతం
జాబిలమ్మ జిలిబిలినీ చూడలనిపిస్తే
పున్నమి అందాన్ని ఆస్వాదించాలనిపిస్తే
కనులు మూసుకొని ఓ ప్రియతమా
నీటి ఒడ్దున నీ పరిచయమే నాకిష్టం
కలగన"లేదు" ఓ చెలియా
నిను కలిసాక, అది కల అని అనుకోలేదు
మరువ"లేని" "జ్ఞాపికలు"
నీ మోము చిందించే చిరునవ్వులే నాకిష్టం
అందుకే "నేడు" పలకాలనిపించింది
ప్రేమ శిశిరానికి ఆహ్వానం
నీ రాకకై ఎదురు చూసింది
నా మదిలొ వసంతపు శుభోదయం
Thursday, April 17, 2008
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 11
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 11
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయాన
సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
కాలంతో నీవు పరుగులు తీయలేవని
తీరాలు దూరాన ఉన్నాయని
అలసి పోయానని భావించి
అడుగులు తీయలేక సొకించి
కలలు కనడం మానకు
మనసుకు సంతొషం దూరం చెయకు
చీకటి వెనుక చిరు దివ్వెటలా
కనుల మాటున మూసిన కనులకు తోడుగా
కలలు దాగి ఉండేను
శుభోదయాన నీ కలతని తీరం చేర్చేను
ఒడుదుడుకుల మాటున
మనసులొ దాగిన ఆశరేకలే
తీరాలు దరిచేర్చు స్నెహాలు
కనులు మూసుకొని ఓ సారి
మనసులొ మిగిలిపొ ఈ సారి..
--మేఘ
Tuesday, April 15, 2008
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 10
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 10
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయాన
సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
కవితలన్నీ ధారలుగా ఏరులై పారగా
వలపులన్నీ మమతలై నీ వైపే చూడగా
ఈ రోజే ఈ నాడే ఒక్క పాట పాడనీ
అది కూడా నీ రూపై వర్ణణగా సాగనీ
ఓ ప్రేమా!! నిజమమ్మా నా ప్రేమా
కల్ల కాదు వలపమ్మా!
నిజమమ్మా నమ్మమ్మా
ఓ ప్రేమా!!
చిక్కదేమి చక్కనమ్మ
చుక్కల్లో చందమామ
వలచిన నా చెలి స్నెహం
నిజమే హాయె సుమా
--మేఘ
Friday, April 11, 2008
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 9
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 9
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయాన
సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-------------------------------------------------------------------
ప్రేమ రాహిత్య జీవితము నీ బ్రతక లేను
ఈ జీవిత నావలో నే సాగలేను
భరువైన హ్రుదయంతొ ఎందమావిలొ నీళ్లు నే తాగలేను
నీరు లేని చలమని నీ తవ్వలేను
ఏ నాడు ఏ దారిలో ఏ మలుపు తిరిగానో
దారిలోని ముళ్ళని కాళ్ళలోన దింపుకొని
సాగలెక ఆగలేక సాగుతూనె ఉన్నాను
ఈ గుండె బాధని నీ ఓర్వజాలలేను
నాలోని ఊపిరి ఎంత వరకు ఆపనూ!
ఎందరో మరి ఎందరో నను దాటిపోయారు
ఈ దారిన పోయారు
దాటిపోయారు ఈ దారిన పోయారు
బాగున్నావని అన్నానా
బహు బధల్లొ ఉన్నానా!
నీ కను సన్నల్లో నలిగిన నా మనసుని చూసి ప్రేమే అనుకున్నా!
గుండెకి గాయమైన మనసుకి కవితలు ఎందుకు
ఆకలిలో ఉన్న మనిషికి బంగారమె ఎందుకు
నా మదికి ఒక మజిలీ చాలులే
సేద తీరగ ఓ తోడు సరిపొవులే
--మేఘ
Sunday, December 30, 2007
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 8
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 8
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-------------------------------------------------------------------
మనసే బాగో లేదు
నా మది గ్నాపకమే చేదు
నీ వలపే రేపినా గాయంతో
సావాసం చేస్తున్నా నేడు
వలపే తగదని అన్నా
నా మనసే వినలెదన్నా
అర్దం తెలిసే సరికి
కన్నీళ్ళే మిగిలాయన్నా
దారి తెన్ను లేక
కనిపించిన దారిలొ సాగేస్తున్నా
ఎటు చెరేనొ తెలియక
మౌనంగా రొదిస్తున్నా
--మేఘ