నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Friday, April 18, 2008

నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 12

----------------------------------------------------------

ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయాన
సాగనీ సాగినంత సమరం నా మదిలోన

-----------------------------------------------------------
సంక్రాంతి సంబరాలు చుడాలనిపిస్తే

అంబర వీదుల అంబరాలు అందుకోవాలనిపిస్తే

"ప్రీయతమా" నీ సాహచర్యం కోరనా ఓ సాయంత్రం

అంతులేని ఆనందం పొందనా ఆసాంతం


జాబిలమ్మ జిలిబిలినీ చూడలనిపిస్తే

పున్నమి అందాన్ని ఆస్వాదించాలనిపిస్తే

కనులు మూసుకొని ఓ ప్రియతమా

నీటి ఒడ్దున నీ పరిచయమే నాకిష్టం


కలగన"లేదు" ఓ చెలియా

నిను కలిసాక, అది కల అని అనుకోలేదు

మరువ"లేని" "జ్ఞాపికలు"

నీ మోము చిందించే చిరునవ్వులే నాకిష్టం

అందుకే "నేడు" పలకాలనిపించింది

ప్రేమ శిశిరానికి ఆహ్వానం

నీ రాకకై ఎదురు చూసింది

నా మదిలొ వసంతపు శుభోదయం

1 comment:

Bolloju Baba said...

మంచి మంచి పదాలతో
మీరు వాక్యాలను సరిగ్గా బ్రేక్ చెయ్యటం లేదనిపించింది.

నా మనసు చెబుతోంది ఓ మనోగతం
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయానసాగనీ సాగినంత సమరం నా మదిలోన

సంక్రంతి సంబరాలు చూడలనిపిస్తే
అంబర వీదుల అంబరాలు అందుకోవాలనిపిస్తే
ప్రీతమా నీ సాహచర్యం కోరనా
ఓ సాయంత్రంఅంతులేని ఆనందం పొందనా
ఆసాంతం జాబిలమ్మ జిలిబిలినీ చూడలనిపిస్తే
పున్నమి అందాన్ని ఆస్వాదించాలనిపిస్తే
కనులు మూసుకొని ఓ ప్రియతమా
నీటి ఒడ్దున నీ పరిచయమే నాకిష్టం
కలగనలెదు ఓ చెలియానిను కలిసాక
అది కల అని అనుకోలేదు
మరువలెని గ్నాపికలూనీ మోము చిందించే
చిరునవ్వులే నాకిష్టం
అందుకే నేదు పలకాలనిపించింది
ప్రేమ శిశిరానికి ఆహ్వానం
నీ రాకకై ఎదురు చూసింది
నా మదిలొ వసంతపు శుభోదయం


ఇలా బ్రేక్ చేసినట్లయితే కవిత అర్ధవంతంగా ఉంటుంది. ఇలాగే చేయాలనేమీ లేదు. ఇది మీరు వ్రాసిన దానికంటే కొంచెం మెరుగ్గా ఉండవచ్చు. అంతే. ప్రయత్నించండి. మీలో మంచి కల్పనా చాతుర్యం ఉంది. కవికి ఉండవలసిన ప్రధాన లక్షణము అది.

బొల్లోజు బాబా

ఒక సారి నాబ్లాగును చూసి మీ కామెంట్స్ వ్రాయండి.
http://sahitheeyanam.blogspot.com/