అనుకోకుండా అయ్యాను నేను సామంత రాజుని నేనూ!
నిర్ణయలేమి నా నైజం అనుభవమే నాకున్న బలము
గడిపేస్తాను ఆడేస్తాను పాలిస్తాను ఆంధ్రదేశాన్ని
కాంగిరేసు మార్కు రాజకీయంతో
ఎవరేమంటే ఏమి నాకేంటి సామి
నవ్వే టోళ్ళు నవ్వనీయని సామి
అరిచేటోల్లే అలిసిపోని సామి
దేవుడే చల్లంగుండా నా ఆరోగ్యం సక్కoగుండా
గడిపేస్తాను ఆడేస్తాను పాలిస్తాను ఆంధ్రదేశాన్ని
కాంగిరేసు మార్కు రాజకీయంతో
సామ్రాజ్ఞి అండ నా చెంత నుండ
ఆంధ్రా మన్మోహనుడంటూ పాడేటి భట్రాజులు నా తోడు ఉండ
తెలంగాణా వాదులు సీమంధ్రా నాయకులు కోట్లడుతూ ఉండ
జగన్మోహను ఓదార్పు చేస్తూ ఉండ
గడిపేస్తాను ఆడేస్తాను పాలిస్తాను
చెణుకులు చెడుగుడు ఆడేయ్యగలను
అసెంబ్లీలో విపక్షం నోటికి తాళం వేసేస్తాను
యువరాజు జన్మదినానికి ఆయన ఫోటోకే కేకు తినిపిస్తాను
అందివచ్చిన అవకాశము దేనినీ వదలను నేను
రేపన్నది ఎవడు చూడొచ్చాడు
రాజేవడో బంటు ఎవడో
ఈ దినము నాదేనన్న
చంద్రన్న బిక్క చచ్చి యాత్రలు చేస్తూ పోనీ
ముక్కు తిమ్మన ఆంధ్రా పార్టీ అంటూ చంద్రన్నని టార్గెట్ చేసేయని
రైతులు యూరియా అంటూ గగ్గోలు పెట్టని
గందరగోళం తింగరమేళం ఈనాడు నా రాజ్యం
చుక్కాని లేని నావకి ఎండిపోయిన పుల్లొకటి చుక్కాని అయిన వైనం
సామాజిక వాదం అంటూ ప్రజారాజ్యం స్థాపించి
అనుకోని సమయాన సమైఖ్యమంటూ
తత్తర బిత్తర పాటు మండాలాధీశుడు
నా బలము నీదేనంటూ పిలవని పేరంటానికి వస్తానంటూ
అయోమయపు నాయకులూ ఉన్నంత కాలం
ప్రతిదినము నాదేనన్న సామంత రాజుని నేనేనన్నా
ఇలా అనుకోకుండా అయ్యాను నేను సామంత రాజుని నేను
కాంగిరేసు మార్కు రాజకీయంతో
జీవితకాలపు స్వప్నాన్ని కలకు అందని ఉత్ధనాన్ని
పొందాను నేను కాంగిరేసు మార్కు రాజకీయంతో
Monday, September 13, 2010
అనుకోకుండా అయ్యాను నేను సామంత రాజుని నేను-కాంగిరేసు మార్కు రాజకీయంతో
Labels:
వ్యంగం
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
బాగుంది ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది...
Post a Comment