నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Thursday, March 10, 2011

బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివారు

ఏమున్నది ఏమున్నది ఈ ఉద్యమాల ఔచిత్యం
దుందుడుకు చర్యలకు ఎక్కడిది ఔనత్య౦
తెలుగు వాడు సిగ్గుపడే దుర్దినం
స్పృహ లేని దిశగా నిర్దేసనం లేని ఈ so called ఉద్యమం

వెర్రి ముదిరితే తలకు రోలు చుట్టమన్నాడొకడు
చుట్టుకున్నోడూరుకోక పది మందిని పోగు చేసి
భలే భలే బావుందంటూ వీధిన పడి వెర్రి తలలు వేస్తున్న ఈ వైనం
పది కాస్త వందలై tankbund విగ్రహాల మీద దుశ్చర్య సాగించిన ఈ కుత్సితం

వార్తని చూశాను టీవీ 9 లో వార్తను చూశాను
దుర్మదాంధ బుద్ధిహీన శూన్యుల దుశ్చర్యలను
వికృతమైన చేష్టలను
బుద్ధిమాంద్యుల ఉనికిని
నా దేశం నా రాష్ట్రము నా జిల్లాలో ఉందని
తెలుసుకొని అభివృద్ధి పధాన సాగుతున్న తీరుని..
హే రామా మాటలు ఆగిపోయి స్థాణువునై నే మిగిలిపోని

ఇన్నాళ్ళు తెలబాన్లు అంటూ బ్లాగర్లు సంభోదిస్తున్న తీరు కరెక్ట్ కాదేమో అన్న ఒక మీమాంసలో ఉన్న జనాలకు ఈనాడు సాగించిన ఈ దుర్మార్గపు దుశ్చర్య వాళ్ళకు ఎంత గౌరవం అర్హమో అంతే లభిస్తుందని నిరూపించుకున్నారు. పరమ భక్తాగ్రేసరుడు పద కవిత పితామహుడు అన్నమయ్య విగ్రహాన్ని కూడా వదల్లేదంటే పిచ్చి ముదిరి రోకలి తలకు కట్టించుకొని తిరుగుతున్నారు.
బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివి మన సంస్కృతికి చిహ్నాలైన మహనీయుల జ్ఞాపికల ఫై పడి మరెంతో ఘన కీర్తిని సంపాయించారు. శబ్భాష్ !! ఉన్మత్త తాండవం చేసే బుద్ధి హీనుడికి పరతమ బేధాలు మంచి చెడు విచక్షణ కోల్పోయి ఈ విధంగానే ప్రవర్తిస్తారు.

రోజు చేయండి మిలియన్ మార్చులు. రాత్రి పగలు తేడ లేక మరీ చేయండి. మనకెలా పనికి మాలిన exams .అవి కూడు పెడుతాయా గుడ్డ పెడుతాయా. భూమి ఏర్పడక ముందే ఏర్పడింది ఈ తెలంగాణా ఆకాంక్ష. యుగాలు మారినా మనువులు మారినా ఈ బ్రహ్మాండం అంతా వ్యతిరేకంగా కుట్రలు చేసి మా కలలు సాకారం కానికుండా మేము దోపిడీకి గురయ్యాము ఈ రాత్రికి రాత్రే తెలిపోవాలె, ఏమి ఎందుకు తేలరాదు రాత్రి పోయి తెలవారట్లే? యుగాల ఆకాంక్ష ఈ రాత్రికి రాత్రి తీరే వరకు ట్యాంక్ బండ్ మీద నిరసన సాగాలి.

20 comments:

SHANKAR.S said...

నిజానికి ఖచ్చితం గా ఇదే భావం తో నేను పోస్ట్ చేయబోతున్నదానిని మీ ఆవేదన చూశాక దీనికి కామెంట్ గా పెడుతున్నా

తలకెక్కిన ఉన్మాదం - ఇదా గాంధేయవాదం?

మిలియన్ మార్చ్ పేరుతో ట్యాంక్ బండ్ పై విధ్వంసం.
చేతులు కట్టుకుని చూస్తోంది చేవ లేని ప్రభుత్వం
ఏ పార్టీ వాడని ఎర్రాప్రగడని కూల్చారు?
ఏ ప్రాంతం వాడని క్రిష్ణదేవరాయుని నీట ముంచారు?
మాట్లాడితే మా సంస్కృతీ మా సంస్కృతి అనే కే.సి,యారూ
ఈ ఉన్మాదమే మీ సంస్కృతా చెప్పండి సారూ?
ఇదేనా మీరు చెప్పే గాంధేయ వాదం
కాదు కాదు ఇది అచ్చమైన కేసియారీయం
స్వచ్చమైన తెలుగులో చెప్తే స్వార్ధ రాజకీయం

(ట్యాంక్ బండ్ మీద తెలంగాణా వాదుల చేతిలో ఘోర పరాభవానికి గురయిన తెలుగు జాతి మహనీయులకు క్షమార్పణలు చెబుతూ)

గమనిక: ఇప్పటి వరకు నేను నా బ్లాగులో "తెలబాన్లు" అనే పదాన్ని ఖండించాను. సాటి తెలుగు వారిని తాలిబాన్లతో పోల్చడం మూర్ఖత్వం అని వాదించాను. కానీ ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ధ్వంసమైన విగ్రహాలలో నాకు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ధ్వంసం చేసిన బుద్ధ విగ్రహాలు కనిపిస్తున్నాయి.కానీ ఉన్మాదంలో వీరు వారినే మించి పోయి తమ తెలుగు జాతి మహనీయుల విగ్రహాలనే కూల్చారంటే వీళ్ళని అలాగే అనాలనిపిస్తోంది.

సుజాత వేల్పూరి said...

నేనింకా తేరుకోలేదు. శ్రీ కృష్ణ దేవరాయలు హుస్సేన్ సాగర్ లోకి! శ్రీ శ్రీ,అన్నమయ్య, ఎర్రాప్రగడ,జాషువా...ఏం చేశారు వీళ్ళంతా తెలంగాణా వాదుల్ని? ఇవాళ్టి మార్చ్ లక్ష్యమే ఇదనుకుంటా బహుశా! ఇంకా నయం బుద్ధ విగ్రహం కూడా కూల్చారు కాదు

Anonymous said...

ఇవాళ ఉదయం కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణావాదులు ట్యాంక్ బండ్ మీదున్న ఆంధ్రప్రముఖుల విగ్రహాలను ధ్వంసంచేసేంత మూఢులు కాదని అన్నారు. తెలంగాణావాదులు ఆ విగ్రహాలను ధ్వంసంచేశాక సాయంత్రానికి ఆయన ప్లేటు తిప్పేశారు. వాటిని కూల్చింది మఫ్టీలో ఉన్న పోలీసులని చెప్పుకొచ్చారు. విజువల్స్ లో తెలంగాణావాదులు విగ్రహాలెక్కి గులాబి జెండాలు పట్టుకుని స్పష్టంగా కనబడుతుంటే కోదండరామ్ కు నోరెలా వచ్చిందో ఇలాంటి మాటలు చెప్పడానికి. ఫక్తు రాజకీయనాయకుడిలా మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా ఆయన మీదున్న గౌరవం కాస్తా పోయింది నాకయితే.

తమ మనుగడకోసం నాయకులు నడుపుతున్న ఈ ఉద్యమంవెనక సంకల్పంలో నైతికత లేదు కాబట్టి ఈ తెలంగాణా ఎప్పటికీ రాదని నాకనిపిస్తోంది.

- శివ

Anonymous said...

police lanu pettinanduku mandi paddaru kadandee naayakuloo?
ippudu choodandee naayakula prakatanalu.. samardhinchu kontoo..thoo raajakeeyaalE gaanee desam emavutundanna spruha leni vedavalu..

Anonymous said...

@siva..తమ మనుగడకోసం నాయకులు నడుపుతున్న ఈ ఉద్యమంవెనక సంకల్పంలో నైతికత లేదు కాబట్టి ఈ తెలంగాణా ఎప్పటికీ రాదని నాకనిపిస్తోంది.
u r 100% correct...telangaanaa ku addu aa naayakula swaardamE...ee kaalam lo koodaa telangaanaa laanti slogans ki kaaranam aa naayakula swaardamE..

Anonymous said...

వాళ్ళేమిటో వాళ్ళు ఋజువుచేసుకున్నారు. మరో అవకాశమిస్తే అన్ని విగ్రహాలనూ కూలుస్తారు.

పోలీసుల చేతులు కట్టివేసి వున్నాయి. పోలీసులకు స్వేచ్చ, ఒక్క అవకాశం ఇస్తే ఒక్క నెలలో వీళ్ళను అణిచివేయగలరు. రాష్ట్రపతి పాలనకు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. అది త్వరలో రావాలని కోరుకుందాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒట్టి ఎదవమూక. సబితారెడ్డి కన్నా తోపుడుబండి మీద అట్లేసుకునే ఏ ఎంకమ్మైనా ఆ పదవిలో నయం.

Anonymous said...

రాష్ట్రంలో హోమ్ మంత్రి ఉందా చచ్చిందా?

Sravya V said...

ఎంత దారుణం !!!!!!!!!!!

Anonymous said...

చూశారా, కోదండ రామ్ పొద్దున్నే హింట్ ఇచ్చాడన్నమాట...సాయంత్రం విగ్రహాలు ధ్వంసం చేసి తీరాలని. వీళ్ళు చేసి చూపించారు

Anonymous said...

telengana people again proved they are fools. thats why these politicians are playing with them. they are becoming mad. people who are participated in todays march should check there mental conditions.

Anonymous said...

Hi Guys first please stop watching TV9.
First think about people who Scarify their life for telangana. After telangana we can reassembled them

Anonymous said...

this is your blog you can call what ever you want.. who cares...

Anonymous said...

since one year where are you when Police were attacked on girls hostel in OU

మేఘ said...

@shankar మీ ఆవేదన అర్ధం చేసుకోగలను ప్రతిస్పందించడానికే అవాక్కయే రీతిలో సాగింది వీళ్ళ దుశ్చర్య.శంకర్ గారు మీరు మీ అభిప్రాయాన్ని బ్లాగ్ చేసి ఉండవలిసింది ఎందుకంటే బ్లాగ్ చేసి ఉంటే మీ ఆవేదన ఎక్కువమందికి చేరే ఆస్కారం ఉంది. అది అవసరము కూడా.

@siva అన్నట్టు prof కోదండరాం హింట్ ఇవ్వనే ఇచ్చాడు.ముష్కర మూకలు తెగించారు.అతను ఏ సబ్జెక్టు ప్రొఫెసరో! పనికి మాలిన అధ్యాపకులను(పని చేయని మేధావులుగా చదువుకోమని వినతి) మేపుతున్న మా university కి జోహార్లు.

@anon "సబితారెడ్డి కన్నా తోపుడుబండి మీద అట్లేసుకునే ఏ ఎంకమ్మైనా ఆ పదవిలో నయం" ఇది భలే బావుంది.ఆమె ఆటలో అరిటి పండు.హోం మినిస్టరు గా ఎప్పుడు వ్యవహరించలేదు.

@anon "Hi Guys first please stop watching TV9. First think about people who Scarify their life for telangana. After telangana we can reassembled them " పోయిన ప్రాణాల విలువ వెలకట్టలేనివి దానికి విగ్రహాల విద్వంసమే నివాళి అనుకుంటే ఘనమైన నివాళీ అర్పించారు. no doubt it will be a trend setter .కాని యీ మార్చ్ ఉద్దేశం అది కాదె. ఆంటే ఏ objective లేకుండా దీనిని నిర్వహించరనుకోవలా ?

@anon "this is your blog you can call what ever you want.. who cares..." care చేయకుండా ఉండి ఉంటే కామెంట్ పెట్టి ఉండే వాడివి కాదు.

@anon "since one year where are you when Police were attacked on girls hostel in OU " నిజమే నేను ఆనాడు పోలీసులు OU లో జోరబదినందుకు ప్రతిస్పందిచలేదు. ఇదే కారణం మీద రేపు మరొక దుశ్చర్యకి పాల్పడండి.రేపు ఇంకోరెవరైనా ప్రశ్నిస్తే ఇదే ఉకడంపుడు కారణాలు quote చేయండి. ఆరోజు నేను బ్లాగ్ చేయకపోవడం వల్ల మిలియన్ మార్చ్ లో విగ్రహాలు ద్వంసం అవుతాయని తెలీనే తెలిదు లేకుంటే ఖచ్చితంగా స్పందించే వాడిని.

Unknown said...

ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే తెలంగాణా ఎప్పటికీ రాదు గాక రాదు. తెలంగాణ సాధించుకోవటానికి ఇది మార్గం అనుకుంటే అది చాలా చాలా తప్పుడు అభిప్రాయం.

Anonymous said...

/where are you when Police were attacked on girls hostel in OU/

The Police have done their DUTY. Police is authorised to arrest and use force on anti-social elements, activists indulging in violent protests damaging government's property. It is 100% justified and we support it in Tg, Andhra or elsewhere in the country, any doubt?

Demolishing disfiguring statues of great personalities is violent and barbaric act and we condemn it, is it clear? It is stupid to ask such questions even. They are different.
----------------------------------

/ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే తెలంగాణా ఎప్పటికీ రాదు గాక రాదు/
బాగా చెప్పారు. అదే కదా మనకు కావాల్సింది. ఆ మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారు, వాళ్ళ విగ్రహాలు కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. భాధాకరమైనా, కూలిన విగ్రహాలు తెలబాన్ల 'వెర్రి ఆందోళన' నైతికంగా కూడా దిగజారి, మట్టి గొట్టుక పోవడానికి సహకరిస్తున్నాయనడంలో సందేహం లేదు.

Bhimu... said...

ఉద్యమ ఉన్మాద వికటాట్టహాసం.. తెలుగు చరిత్రకు తీరని కలంకం...

nenu ituvanti manushula madya puttinanduku siggupaduthunnaaa...

telanganam said...

ma jobs kottesinare,
ma cheruvulu dvamsam chesinare,
ma prajalanu fools annare,
adi unmaadam kaadaaa,
adi ekkadi gandheyam,
adi maaku parabavam kaadaa,
tanadaaka vaste gaani teliyadu tammi,
vastundi aaa vela kuda vastundi....

Anonymous said...

@ Bhimu...
nenu ituvanti manushula madya puttinanduku siggupaduthunnaaa...
-----------

మరి ఎక్కువ సిగ్గు పడకు. ఎదవది ఏ హిరోయిన్ అని జనాలు మీద పడతరు.
If not possible, than better to try in Films. Best Wishes

HarshaBharatiya said...

ఆ రోజు జరిగిన దానికి చాలా బాధ గా ఉంది.
కానీ చివర్లో రాసిన వాక్యాలు నచ్చలేదు
(భూమి ఏర్పడక ముందే ఏర్పడింది ఈ తెలంగాణా ఆకాంక్ష. యుగాలు మారినా మనువులు మారినా ఈ బ్రహ్మాండం అంతా వ్యతిరేకంగా కుట్రలు చేసి మా కలలు సాకారం కానికుండా మేము దోపిడీకి గురయ్యాము )
But one thing i want to say...
I think you don't know why Telangana ppl want to separate from andrapradesh...
Before going to comment on any social movements or the great persons or anything else
దాని గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ తరువాత కామెంట్స్ చేయండి