ఈ రెండు రోజుల హడావిడి వల్ల ఆంధ్ర జనాలకి ఒరిగిందేమీ లేదు కాలక్షేపం, కాసింత మసాల. ఆపుకోలేని ఆత్రుతని చల్లార్చుకోవడం తప్ప! ఏం చేద్దామని ఏం చేసిందో కాని ఈ అధిష్టానం తలనోప్పంటే మోకాలికి బానే వేసింది, zandu balm .
సందెట్లో సడేమియా లా తంతే బూరల బుట్టల పడ్డట్టైయింది కిరణు కుమారుడికి. యోగం భోగం రాసి పెట్టుంటే ఆపడం ఎవ్వరి తరము కాదు.
పాపం సమ్మె చేసే ఉద్యోగులు రోడ్డు బాట పట్టిన బీడి కార్మికులు వాళ్ళని పలకరించే నాధుడే లేకపోయాడు పేపర్లు మీడియా అంతా ఈ డ్రామా వెనకాతలే పడ్డారు . బీహారు ఎలెక్షన్ పలితాలు చూసినా కాని వాతకి మందు బర్నాల్ కాని zandu balm కాదని ఎప్పుడు గ్రహిస్తారో ఈ కాంగీయులు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే నాయకుడే కరువయ్యాడు కాంగిరేసు లో.ఈ కిరణుడి మీద ఆల్రెడీ ఎన్నో ఆరోపణలున్నాయి. బాబుకి మళ్ళి పనికి సిద్దం అవ్వాలి. పొద్దున్న లేస్తూనే ప్రబుత్వం మీద విరుచుక పడాలి కదా. చేత కాకపొతే దిగు దిగు అని రోశయ్య దిగే దాక అరిచి అలిసిపోయాడు ఇప్పుడు కిరణ్ మీద అరవాలి. ఎంతైనా బాబు వాసి రాసి అన్ని బాగున్నై. అయన ప్రతిపక్ష నాయకుడిగా ఎంత మంది CM లను చూస్తున్నాడో! CM లు మారతున్నారే కాని ప్రతిపక్ష నాయకుడిగా ఈయన స్థానం సుస్థిరం. తుమ్మితే ఉడే CM పదవి కన్నా కదలని opposition leader పోసిషన్ఏ బెటర్.
జగన్మోహనుడు కొత్త sketch తో రావాలి. ఆయన రాతలకి కోతలకి కొన్నాళ్ళు విరామం. తలకు కట్టిన బొప్పి కొంచెం మాడు పట్టాలంటే కొన్నాళ్ళాగాలి. మళ్ళి అయన బిజీ బిజీనే . కిరణు కుమారు కూడా బిజీ బిజీ అధిష్టానం ఆదేశాలణుగుణంగా నడుచుకొని అధిష్టానానికి కోట్లఅoదియాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక బంగారు బాతు గుడ్డు కాబట్టి. తెలంగాణా కాంగీయులు మాత్రం ఎప్పడి లాగ వాళ్ళ అజెండా వాళ్లకి ఉంటుంది. సోనియా అమ్మ, అధిష్టానం , అనవసర సమయాల్లో అక్కరకు రాని ఆవేశం బోరు కొట్టనే కొట్టవు. వాళ్లకవి పుష్కలంగా ఉన్నాయి. పూటకో బట్రాజు గీతం రోజుకో వీధి బాగోతం చూసి చూసి TV చూసే వాడికి బోరు కొట్టి ఎవ్వడి పాపాన వాడు పోతాడులే అని ఛానల్ మార్చి మనం మారాల్సిందే వీళ్ళు మారరు.
ఇంకో విధంగా ఆలోచిస్తే ఉన్న తుప్పు(క్కు) మంత్రి వర్గ ప్రక్షాళన చేయడానికి ఇదే ఒక మార్గంగా కూడా ఆలోచించి ఉండొచ్చు. కాని ఏ విధంగా చూసినా CM ఎంపిక సామాన్యుడి ఆశలకు అడియాసే. పాలడుగు వెంకట్రావు మద్యాహ్నం సామాన్యుడి లాగానే ఒక అడియాసని వ్యక్త పరిచాడు, మళ్ళి నేను కాoగ్రెస్సు వాడినని రొమ్ము విరబూచుకొని తిరిగే లెవెల్లో CM ఎంపిక ఉండాలని. నువ్వు నాకు నచ్చావ్ లో వెంకీ లాగ నీవు ఇస్తావు ఎందుకంటే basically నీవు మంచి GOD వి అని ఆశ పడినా మనం రోడ్డు మీద పదాలే కాని మన ఆశలు పైవాళ్ళ చెవుల్లో పడవు. ఓట్లు వేసేది మనం సీట్లు డిసైడ్ చేసేది పైవాళ్ళు. ఏముంది ఒక 2 రోజులుంటే అంతా షరా మామూలే. ABN ఛానల్ లో న్యూస్ ఆశించి ట్యూన్ చేస్తే 24 గంటల్లో 20 గంటలు మహా యంత్రం , గ్రీన్ టీ అని ప్రకటనలు వచ్చి కడుపులో తిప్పినట్టు ఒకటి కాకుంటే ఇంకో Ad ఉన్న ఛానల్ తిప్పిడం, అన్ని మనకు అలవాటే .
Wednesday, November 24, 2010
అధిష్టానం తలనోప్పంటే మోకాలికి బానే వేసింది zandu balm
Labels:
రాజకీయాలు
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
:)
:):)
adurs basooo....
Post a Comment