నా మనసు చెబుతోంది ఓ మనోగతం-6
-------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయనా
సాగనీ సాగినంత ఈ సమరం నా మదిలోన
-------------------------------------------
మనసు లోతున పొంగిన ప్రేమకి
కడలి అంచునా నిలిచిన మనసుకి
అలల స్థానం తెలిసేదెలా
తనలో ప్రేమని తెలిపేదెలా
తీరాలు చేరాలనుకొని సాగిన పయనం
సాగేటి ప్రయణంలొ
గమ్యం కానరాకుంటే
ఏమి చేసేది నేను ఎటు పోయేది
వసంతం చేరాలుకొని
గ్రీష్మాన్ని కౌగులించిన వైనం
మది వెరిసే బాధ తాళలేక
అందరి మధ్య ఒక్కడైన ఈ సమయాన
ఏమి పలికేది నీకు ఏమి తెలిపేది
ఆకసాన్ని చూసాను
నా అంతరంగం ప్రతిబింబంలా
అగమ్యమై గోచరించింది
గల గల పారే సెలయేరు చూసా
దాని ప్రవాహంలో ప్రశాంతత నాలో కరువయ్యింది
తీరు తెన్ను లేని ఆలొచనతొ
కనిపించిన దారులలొ
కాస్త ఆగుదామని చెసే పయనం
కాసింత విశ్రాంతి కోసం సాగుతూనే ఉంటా....
--మేఘ
Friday, August 10, 2007
నా మనసు చెబుతోంది ఓ మనోగతం-6
Labels:
మేఘ
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
గలగల పారే ఏరు ప్రవాహంలో ప్రశాంతతా? అర్థంగాలా.
సెలYఏరు ప్రశాంతంగా పారుతుంది కదా
Post a Comment