నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Thursday, August 9, 2007

నా మనసు చెబుతోంది ఓ మనోగతం-4

నా మనసు చెబుతోంది ఓ మనోగతం-4
-------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయానం మొదలు పెడుతున్నా ఈ సమయనా
సాగనీ సాగినంత ఈ సమరం నా మదిలోన
-------------------------------------------
గుండె మండే అగ్నికణం
రగులుతోంది మదిలోన
చల్లారే దారి తెలీక ర
గులుతోంది లోలోనా
బయట పడే రోజు కోసం
ప్రతి క్షణం ఈ ఎదురు చూపు


సాయంత్రమా నీ చల్లదనము
రవ్వంతగా నా మనసుకివ్వమ్మా
నేనోర్వలేను ఏ మంటల్ని
కన్నీళ్ళు కూడా కరువాయెనే


అర్ధ రహిత జీవితం
ఆత్మశాంతి పూజ్యము
నీ దరి కానరాక
దారులన్ని మూసిపొయనే


కలతన్నది చిరునామాగా
కలకాలము మిగిలుండునా!
నేనోర్వలేను నేనోర్వజాలను
ఇక ఏ మత్రము నా వల్లనూ..

No comments: