నా మనసు చెబుతోంది ఓ మనోగతం-6
-------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయనా
సాగనీ సాగినంత ఈ సమరం నా మదిలోన
-------------------------------------------
మనసు లోతున పొంగిన ప్రేమకి
కడలి అంచునా నిలిచిన మనసుకి
అలల స్థానం తెలిసేదెలా
తనలో ప్రేమని తెలిపేదెలా
తీరాలు చేరాలనుకొని సాగిన పయనం
సాగేటి ప్రయణంలొ
గమ్యం కానరాకుంటే
ఏమి చేసేది నేను ఎటు పోయేది
వసంతం చేరాలుకొని
గ్రీష్మాన్ని కౌగులించిన వైనం
మది వెరిసే బాధ తాళలేక
అందరి మధ్య ఒక్కడైన ఈ సమయాన
ఏమి పలికేది నీకు ఏమి తెలిపేది
ఆకసాన్ని చూసాను
నా అంతరంగం ప్రతిబింబంలా
అగమ్యమై గోచరించింది
గల గల పారే సెలయేరు చూసా
దాని ప్రవాహంలో ప్రశాంతత నాలో కరువయ్యింది
తీరు తెన్ను లేని ఆలొచనతొ
కనిపించిన దారులలొ
కాస్త ఆగుదామని చెసే పయనం
కాసింత విశ్రాంతి కోసం సాగుతూనే ఉంటా....
--మేఘ
Friday, August 10, 2007
నా మనసు చెబుతోంది ఓ మనోగతం-6
Thursday, August 9, 2007
నా మనసు చెబుతోంది ఓ మనోగతం-5
నా మనసు చెబుతోంది ఓ మనోగతం-5
-------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయానం మొదలు పెడుతున్నా ఈ సమయనా
సాగనీ సాగినంత ఈ సమరం నా మదిలోన
-------------------------------------------
కథ చెబుతా ఒకటి వింటావా
కోకిల ఒకటి వచ్చింది
కమ్మని రాగము వినిపించి పావురయీ
స్నేహము రమ్మని పలికింది
పలికిన పలుకులు వినగానే
లోకము అబ్బురమ్మనిపించి
గల గల కిల కిల పలికిన కోయిల పలుకులు వింటూనె
జీవిత మలుపునె మరిచింది
అవధులు దాటె ఆనందము తన సొంతమని నమ్మి
మురిసి మురిసి మురిపాలన్ని కోయిల పాటలొ వెతికింది
ముత్యాల వెల్లువ నవ్వులు చూసి పిచ్చి పావురమూ..
తానె కొయిల అయ్యనని నమ్మిందీ!
కొయిల కొమ్మని వీడగానె
చెసిన బాసలు మారిన కాలములో కరిగిన వైనం
పిచ్చి పావురానికి అర్ధము కాక
రాయీగా తాను మిగిలింది.
ఒక్కసారి కొయిలని కలిసి గుండె అవిసెలా ఎడ్వాలని కోరికతొ
రోజులు భారము గా నడుపుతూ..
ఏడుస్తూ నడిచె వైనముకి కాలమె కరిగితే
ఎగిరి కొయిలని కలువమని నీవూ ఒకసారి చెబుతావా...
--మేఘ
నేను గత నెల రోజులలో చెసిన 2 మంచి పనులు ఏంటి? -అవలోకనం
1)నేను గత నెల రోజులలో చెసిన 2 మంచి పనులు ఏంటి?
2)మనిషి రేపు చనిపొతాడు అని తెలిస్తె ఈ ఒక్కరోజులొ చేసే పనులు ఏమిటి?
3)ఇష్టమైన మనిషి దూరమైతే మనసు పదె ఆవెదన ఏమిటి? దానికి అనుసంధానంగా మనిషి కలిగే ఆలోచన విధానం ఎలా ఉంటుంది?
4)నీకు 5 నిమిషలు ఇచ్చి ఒక పని చెయమంటె ఏమేమి చేయగలవు?
5)జీవితం లో ఇంతవరకు చెసిన అన్నింతి కంటె పిచ్ఛి పని ఏమిటి?
6)జీవితం లో నీకు బాగా గుర్తుండి పోయే సంఘటన ఏంటి( అలొచించ కూడదు) ఆలొచిస్తే స్కిప్ చెయండి
7)అన్నింటి కంతె బాగా నచ్చిన సినిమా ఏంటి? (టక్కున చెప్పాలి)8)నచ్చిన పుస్తకం?
9)నచ్చిన మనిషి?
10)జీవితం లో బాగా గుర్తుండిపొయె రోజు?
11)జీవితం లో ఎక్కువగ ఎవరిని ద్వేషించెది ఎవ్వరిని?
12)జీవితం లో ఎక్కువగ ఎవ్వరిని ప్రేమించేది ఎవ్వరిని?
13)నచ్చని విషయం ఏమిటి?
పై వాటిలొ తడుముకోకుందా ఎన్నింటికి చెప్పగలరొ ప్రయత్నించండి.ప్రశ్నలు పిచ్చిగా అనిపిస్తే క్షంతవ్యుణ్ని.ఇలాంటి ప్రశ్నలు మనం మనకి ప్రశ్నించుకున్న సందర్భాలు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు.మీకి వీటికి సమధానం ఇవ్వాలనిపిస్తే పంచుకొవాలనిపిస్తే ఆనందకరంఈ ప్రశ్నలు ఎవరికిన కాస్త ఉత్సాహం ని కలుగ చేసినా సంతోషమే
--మేఘ
నా మనసు చెబుతోంది ఓ మనోగతం-4
నా మనసు చెబుతోంది ఓ మనోగతం-4
-------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయానం మొదలు పెడుతున్నా ఈ సమయనా
సాగనీ సాగినంత ఈ సమరం నా మదిలోన
-------------------------------------------
గుండె మండే అగ్నికణం
రగులుతోంది మదిలోన
చల్లారే దారి తెలీక ర
గులుతోంది లోలోనా
బయట పడే రోజు కోసం
ప్రతి క్షణం ఈ ఎదురు చూపు
సాయంత్రమా నీ చల్లదనము
రవ్వంతగా నా మనసుకివ్వమ్మా
నేనోర్వలేను ఏ మంటల్ని
కన్నీళ్ళు కూడా కరువాయెనే
అర్ధ రహిత జీవితం
ఆత్మశాంతి పూజ్యము
నీ దరి కానరాక
దారులన్ని మూసిపొయనే
కలతన్నది చిరునామాగా
కలకాలము మిగిలుండునా!
నేనోర్వలేను నేనోర్వజాలను
ఇక ఏ మత్రము నా వల్లనూ..
Wednesday, August 8, 2007
నా మనసు చెబుతోంది ఓ మనోగతం-3
నా మనసు చెబుతోంది ఓ మనోగతం-3
-------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయానం మొదలు పెడుతున్నా ఈ సమయన్నా
సాగనీ సాగినంత ఈ సమరం నా మదిలోన
---------------------------------'
నీకు దూరమయ్యానో ప్రెమద్రోహి నయ్యానో
నీ రూపం నా మదిలో చెరగలేదు
నిదుర కూడ రానీక
గుండె లోన గుడికట్టుకున్నావే
ఊహనైనా నా తలపు నీకు లేదని విన్నాక
గతించని గతాన్ని తలచి తలచి వగిచాను
నీ మీద ద్వెషం రాక ఏడ్చను
నా కనుల లోన చూశావు
కనుపాపవని అన్నావు
నీ ఎడబాటు మిగిల్చిన ఈ వేదన
ఎడారి వానలో కళ్ళ నీళ్ళ పర్యంతరం తెలుసుకో
ప్రేమ అన్నది ఓ అనుభూతి అని అనుకున్నా
అనుభూతి మిగిల్చిన వేదన తెలిశకా
ప్రేమ అన్నది భారమని తెలుసుకున్నా
తెలిసే వేళకి ఎందిపోఇన ఆకులా ఎగిరెగిరి పోతున్నా
తెలియ రాని తీరాల్లొ ఒంటరినై పొతున్నా
నా మనసు చెబుతోంది ఓ మనోగతం-1
నా మనసు చెబుతోంది ఓ మనోగతం-1
-------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయానం మొదలు పెడుతున్నా ఈ సమయన్నా
సాగనీ సాగినంత ఈ సమరం నా మదిలోన
---------------------------------------------------------------------
చెప్పాలని ఉంది మనసు విప్పాలని ఉంది
గుండె లోతు బాధని నీ ముందు చెప్పాలని ఉంది
నీవెమూ నేను రాలెని తీరాలని చెరుతున్న ఈ వేళ
మనసు బాధ మది లోన దాచలేక మనసు విప్పాలని ఉంది
హలాహలం నాలోన దాగి ఉన్న నా మది లోన
ఓ క్షణమాత్రం నీ ముందు నిలవాలని ఉంది
నా వ్యధ బాధ తెలపాలని ఉంది
నీవు దూరమయ్యే ఉదయాన్ని ఊహా మాత్రమే నా తరమా
ఆపలేని ఉదయాన్ని గడపలెనీ ఈ క్షణం క్షణం యుగాల్నీ
మౌనంగా మిగిలి పొయి నిలుచుండి చూస్తున్నా!
ఏ అక్షరాలు సరిపోవు గుందె బాధ తెలపగా
వేదనే మిగిలేనా మిగిలిన జీవిత కాలన్నా
నీవు ఓడి గెలిచావో నేను ఓడి ఓడానో
అందరీ మధ్య నేనున్నా ఒంటరిని నిలుచున్నా!
-----------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయానం మొదలు పెడుతున్నా ఈ సమయన్నా
సాగనీ సాగినంత ఈ సమరం నా మదిలోన
------------------------------------------------------
సమరమే సాగించే సమయాన్నా
గుండె చప్పుడు ఒక సారి వినుమన్నా
కాలంతొ ఎదురీత అఆలు కాదమ్మ
గుండె కోతకి సిద్దమై నిలబడుమా
గాయన్ని కాలం మాణ్పునేమో కాని
గతాన్ని చెరెపే కాలయంత్రం ఒకటుందా
చేదు గ్నాపకం ఫీదకలగా నిద్రలేమి ఇస్తుంటే
వర్తమానం ప్రతి దినము గతమేగా
అనుక్ష్ణం అది నాకు గాయమేగా
చెయీ జార్చుకున్ననూ
నిటి లోన రాతలు చదవాలని వెతుకుతున్నా
కళ్ళ నీళ్ళు కనిపించె
నీ అక్షరం మాత్రం కానరాలె
ఒక రోజు ఎడ్చావు
మరో రోజు నవ్వావు
అర్ధం కాని ఈ నవ్వు
నా జీవిత అర్ధన్ని మార్చిందని
తెలుసుకొని కుమిలిపోయి
ఒంతరిగా మిగిలాను
కాన రాని నిన్నటి దినానికి ఎదుర్తు చూస్తు నిలుచున్నా..