నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Thursday, March 10, 2011

బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివారు

ఏమున్నది ఏమున్నది ఈ ఉద్యమాల ఔచిత్యం
దుందుడుకు చర్యలకు ఎక్కడిది ఔనత్య౦
తెలుగు వాడు సిగ్గుపడే దుర్దినం
స్పృహ లేని దిశగా నిర్దేసనం లేని ఈ so called ఉద్యమం

వెర్రి ముదిరితే తలకు రోలు చుట్టమన్నాడొకడు
చుట్టుకున్నోడూరుకోక పది మందిని పోగు చేసి
భలే భలే బావుందంటూ వీధిన పడి వెర్రి తలలు వేస్తున్న ఈ వైనం
పది కాస్త వందలై tankbund విగ్రహాల మీద దుశ్చర్య సాగించిన ఈ కుత్సితం

వార్తని చూశాను టీవీ 9 లో వార్తను చూశాను
దుర్మదాంధ బుద్ధిహీన శూన్యుల దుశ్చర్యలను
వికృతమైన చేష్టలను
బుద్ధిమాంద్యుల ఉనికిని
నా దేశం నా రాష్ట్రము నా జిల్లాలో ఉందని
తెలుసుకొని అభివృద్ధి పధాన సాగుతున్న తీరుని..
హే రామా మాటలు ఆగిపోయి స్థాణువునై నే మిగిలిపోని

ఇన్నాళ్ళు తెలబాన్లు అంటూ బ్లాగర్లు సంభోదిస్తున్న తీరు కరెక్ట్ కాదేమో అన్న ఒక మీమాంసలో ఉన్న జనాలకు ఈనాడు సాగించిన ఈ దుర్మార్గపు దుశ్చర్య వాళ్ళకు ఎంత గౌరవం అర్హమో అంతే లభిస్తుందని నిరూపించుకున్నారు. పరమ భక్తాగ్రేసరుడు పద కవిత పితామహుడు అన్నమయ్య విగ్రహాన్ని కూడా వదల్లేదంటే పిచ్చి ముదిరి రోకలి తలకు కట్టించుకొని తిరుగుతున్నారు.
బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివి మన సంస్కృతికి చిహ్నాలైన మహనీయుల జ్ఞాపికల ఫై పడి మరెంతో ఘన కీర్తిని సంపాయించారు. శబ్భాష్ !! ఉన్మత్త తాండవం చేసే బుద్ధి హీనుడికి పరతమ బేధాలు మంచి చెడు విచక్షణ కోల్పోయి ఈ విధంగానే ప్రవర్తిస్తారు.

రోజు చేయండి మిలియన్ మార్చులు. రాత్రి పగలు తేడ లేక మరీ చేయండి. మనకెలా పనికి మాలిన exams .అవి కూడు పెడుతాయా గుడ్డ పెడుతాయా. భూమి ఏర్పడక ముందే ఏర్పడింది ఈ తెలంగాణా ఆకాంక్ష. యుగాలు మారినా మనువులు మారినా ఈ బ్రహ్మాండం అంతా వ్యతిరేకంగా కుట్రలు చేసి మా కలలు సాకారం కానికుండా మేము దోపిడీకి గురయ్యాము ఈ రాత్రికి రాత్రే తెలిపోవాలె, ఏమి ఎందుకు తేలరాదు రాత్రి పోయి తెలవారట్లే? యుగాల ఆకాంక్ష ఈ రాత్రికి రాత్రి తీరే వరకు ట్యాంక్ బండ్ మీద నిరసన సాగాలి.