ఆకలి గొన్న కడుపుతో అవతలి వాడికి అన్నం పెట్టి ఆకలి తీర్చవచ్చు. పిడచకట్టిన గొంతుతో అవతలి వాడి దాహం తీర్చలేము.ప్రేమించలేని మనసుతో అవతలి వ్యక్తికి ప్రేమను పంచలేము ప్రేమను పొందలేము. మనిషి బతకడానికి ప్రేమ ఎందుకు కావాలి? అసలు ప్రేమ అంటే ఏమిటి? ఈ ప్రేమన్నది పలు సందర్భాలలో పలు రకాలుగా నిర్వచింపబడుతుంది, అయితే ఇందులో ఏది సరిఅయిన నిర్వచనం? ఏది ప్రామాణికం? ఈ ప్రపంచంలో ABSOLUTE అన్నది ఏది లేదు. ప్రతిదీ RELATIVE కొలమానంలో నిర్దేశింపబడినదే. నిన్న సరి అనుకున్నది నేడు సరికాకపోవచ్చు. ఈరోజు ఇక్కడ సరి అనుకున్నది వేరేచోట అది సరి కాదేమో. ఈ ప్రపంచంలో మార్పు ఒక్కటే శాశ్వతం.దాని ముందు మిగిలినవన్నీ దిగదుడుపే.
ఈ ఆకలి ఏందీ, దాహం ఏందీ, ప్రేమ అంటున్నావు ప్రామాణికం ఇవ్వన్నీ HI-FI Terminology ఏం చెప్తున్నావు, ఏం రాస్తున్నావు.ఏమిటి ఈ అంతర్ సంఘర్షణ? మనిషి ఎన్ని రకాల సంఘర్షణ ఎదుర్కున్నా తాను ఆనందంగా ఉండటం కోసమే. మరి ఈ ఆనందం అనేది మనిషికి బ్రహ్మపదార్ధం ఎలా అయింది. ఏం కావాలి మనిషి బతకడానికి. ఏం చేస్తే మనిషి ఆనందంగా ఉంటాడు. ఆలోచించడానికి ప్రతిదీ చిన్నదిగానే తోస్తుంది. కాని మనిషి ఎందుకు అనుకున్నవి పొందలేకున్నాడు. వీటన్నికి కారణభూతం మనిషి మస్తిష్కంలో ఉద్భవించే ఆలోచనలు. ఈ ఆలోచనలు ఇక్కడ నుంచి ఉద్భవించి తరంగాల్లా పది దిక్కులా మనిషి ఆలోచనల్ని కట్టి పడేస్తున్నాయి. ఒకటా రెండా పది వైపులా మనిషిని పది రాకాలుగా లాగేస్తే ఎటువైపు నుంచి విడుపించుకోలేక మనిషి vicious cycle లో ఇరుక్కొని ఈ సంఘర్షణ జీవితాంతం అనుభవిస్తూన్నాడనిపిస్తుంది. ఈ ఆలోచనల్ని ఒక్క చోట కేంద్రీకరించి వాటి మీద ఆధిపత్యం సంపాయించకున్నా అదుపులో ఉంచగలిగితే సార్ధకత సాదించినట్టే.మనిషి తాను ఆనందంగా లేకుండా పక్క వాడికి సంతోషం ఎన్నడు పంచలేడు. మనిషికి ఇవ్వన్నీ ఒకరు నేర్పిస్తే నేర్చుకునే పాఠాలు కావేమో. జీవిత యానంలో ఒక్కో మెట్టు దాటుకుంటూ స్వీయనుభావంతో నేర్చుకున్నవే కడదాక మిగిలి పోతాయి మరి కొందరికి దిశా నిర్దేశం చేస్తాయి.